గత మూడు నెలల నుండి లాక్ డౌన్ సమయంలో నిబంధనలను పాటించని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ వాహనదారులకు శుభవార్త తెలియజేశారు. లాక్ డౌన్ లో పట్టుబడిన వాహనాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. కాకపోతే వాహనానికి సంబంధించిన పూర్తి కాగితాలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు సంప్రదించి వాటిని తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు.

 

 

ఇక ఈ విషయంపై ఇప్పటికే ప్రతి జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. అయితే ఇక అటు దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాలలో భారీగా సడలింపులు ఇవ్వడంతో ప్రజా వ్యవస్థ అంతా ఒక్కొక్కటిగా మొదలు అవుతోంది. ఇక మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను పోలీసులు విడుదల చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ప్రజలకు విధితమే. అంతేకాకుండా అందుకు విధించిన జరిమానాలను చెల్లించేందుకు ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవల ద్వారా వాటిని చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రం మొత్తం మీద లాక్ డౌన్ సమయంలో ఏకంగా ఒక లక్ష 60 వేల వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

 


నిజంగా చాలా మంది యువకులు బయట పని లేకున్నా సరే ఇంట్లో బోర్ కొడుతుందని వాహనాలు తీసుకొని రోడ్ల పైకి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారు కరోనా వ్యాప్తి చేయడంలో ఎలా ఉన్నారు. ఇప్పటికైనా వారు తమ ఆలోచనలు మానుకొని ఇంట్లో ఉంటూ కరోనా వ్యాప్తి చేయకుండా ఉంటే చాలు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: