ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి కరోనా ఎంత ఉధృతంగా పెరిగిపోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 54 లక్షల మందికి కరోనా సోకింది. అందులో ఏకంగా మూడు లక్షల 40 వేల మంది చనిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే... ఇక రోజు రోజుకి భారతదేశంలో కూడా కరోనా సంఖ్య పెరిగిపోతుంది. నేటితో భారతదేశంలో లక్షా 25 వేల కేసులు నమోదయ్యాయి. అందులో 3520 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. 

IHG

చిన్న, పెద్ద, బీదా, బడుగు, ధనికుడు అని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒకేలా చూసే కరోనా ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ తన విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. మరో వైపు ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు శ్యాస్త్రవేత్తలు రేయింబవళ్ళు వారి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

IHG


ఇకపోతే తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఆరు రోజుల కవలలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలోని మొలికూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ ఇటీవల ఒక ఆడ బిడ్డ, ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ సంఘటన మే 16న వాదర్ నగర్ లో చోటు చేసుకుంది. అయితే ఆ పిల్లలకి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శుక్రవారంనాడు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 


అయితే ముంబై నుంచి వచ్చిన ముగ్గురు ద్వారా ఆ గ్రామంలో కరోనా వ్యాధి ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం ఆ గ్రామం ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: