అదేంటో కొన్ని విషయాలు మరచిపోదామంటే కూడా ఎవరూ మరువలేరు. తెలుగుదేశం పార్టీకి జరిగిన పరాభవం కూడా అలాంటిదే. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎక్కడో పరమ శివుని శిరసున పుట్టిన గంగ భగీరధ ప్రయత్నంతో భువికి దిగి చివరకు ఇలా పాతాళానికి జారిపోయిందని అంటారు. తెలుగుదేశం ప్రాభవం కూడా అలాంటిదే అనుకోవాలేమో.

 

ఎన్టీయార్ పెట్టిన పార్టీ టీడీపీ. ఒక విధంగా టీడీపీని తలచుకుని ప్రతి తెలుగువాడు గర్వించే రోజులు ఆనాడు ఉండేవి.తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని నిలిచిన సందర్భాలు ఎన్నో నాడు అన్నగారి నాయకత్వాన  టీడీపీలో జాతి మొత్తం చూసింది. ఇక ఎన్టీయార్ చేతుల్లో పార్టీ ఒకసారి ఓడిపోయింది. అది కూడా గౌరవప్రదంగానే ఎన్టీయార్ నాలుగు అసెంబ్లీ ఎన్నికలు, మూడు పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొన్నారు.

 

రెండు సార్లు తప్ప అన్ని సార్లూ మంచి సీట్లను గెలిచి టీడీపీ విజయఢంకా మోగించింది. 1984లో అయితే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పొషించిది. అటువంటి  పార్టీ అల్లుడు చంద్రబాబు చేతుల్లోకి రాగానే ఏమైందో చెప్పాల్సిన అవసరం లేదు ఉమ్మడి ఏపీలో చూసుకుంటే తెలంగాణాలో చాప చుట్టేసింది. ఇక ఏపీలోనూ గత ఏడాది ఇదే రోజున టీడీపీ 23 సీట్లతో పాతాళానికి పడిపోయింది.

 

ఏపీలో ఇపుడు రాయలసీమ వంటి చోట్ల టీడీపీ ఉనికి కనిపించని స్థితి. ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాలూ అదే కధ, దక్షిణ కోస్తాలోనూ సేం సీన్. బలం బాగా ఉందనుకున్న క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తగ్గిపోయింది. ఏడాది గడచినా పార్టీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. అందుకే మే 23 2019 అంటే పచ్చ పాటీకి వణుకు, బెదురు. అసలు 23 నంబర్ ని చూస్తేనే వెగటు. కానీ ఆ ప్రతీసారి అలా  నంబర్ వస్తూనే ఉంటుంది. టీడీపీకి చేదుని తినిపిస్తూనే ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: