దేశంలో ప్రతి రాష్ట్రంలో, పలు జిల్లాల్లో చారిత్రక కట్టడాలు ఉంటాయి. చారిత్రక కట్టడాలు ఆ ప్రాంతం యొక్క కీర్తిప్రతిష్టలను పెంచుతూ ఉంటాయి. అలాగే విజయనగరం జిల్లాలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభం ఎంతో ఖ్యాతి పొందింది. మూడు ప్రధాన రహదారుల కలిసే చోట హరికేన్ లాంతర్ల స్తంభం ఉండేది. స్తంభంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాలు ఉన్నాయి ఈ స్తంభాన్ని స్థానికులు మూడు లాంతర్ల స్తంభం అని పిలుస్తారు. 
 
మూడు లాంతర్ల స్తంభం వల్ల ఆ ప్రాంతానికి మూడు లాంతర్ల జంక్షన్ అనే పేరు వచ్చింది. రాత్రి సమయంలో ప్రయాణికులకు రోడ్డు కనిపించేందుకు రాజుల కాలంలో మూడు లాంతర్ల స్తంభాన్ని నిర్మించారు. రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడంతో జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం చారిత్రక కట్టడాన్ని కూల్చివేసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
అయితే విమర్శలు వ్యక్తమవుతూ ఉండటంతో మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు మూడు లాంతర్ల స్తంభం వివాదం గురించి స్పందించారు. తన బాబాయి అశోక్ గజపతి రాజు, చంద్రబాబు తప్పుడు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం మూడు లాంతర్ల స్తంభం ఉన్న ప్రదేశంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని... ఇదే వాస్తవం అని ఆమె తెలిపారు. 
 
పనులు పూర్తైన అనంతరం మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టిస్తారని చెప్పుకొచ్చారు. ఒక గదిలో మూడు లాంతర్ల స్తంభాన్ని భద్రపరిచామని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి కలకలం సృష్టిస్తున ఈ ఘటన సంజయిత గజపతిరాజు వివరణతో సద్దుమణిగినట్టే అని చెప్పవచ్చు. ఈ వివరణ తరువాత అశోక్ గజపతిరాజు, టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.                

మరింత సమాచారం తెలుసుకోండి: