మోడీ ఆరేళ్ళుగా ప్రధానిగా ఉన్నారు. ఆయన ప్రభ రెండు ఎన్నికల్లోనూ ఘనంగా వెలిగిపోయింది. 2014 ఎన్నికల్లో 281 సీట్లు వస్తే 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. దాంతో మోడీ కత్తికి ఎదురులేకుండా పోయింది. మోడీ సర్కార్ రెండవమారు అధికారంలోకి వచ్చాక విపక్షం నోరు మొదటి ఏడాది అసలు  లేవలేదు.

 

ఇపుడు కరోనా వేళ లాక్ డౌన్ అంటూ రెండు నెలల పాటు దేశాన్ని మూసేసి ఇపుడు మెల్లగా తెరుస్తున్నారు. ఈ సమయంలో దేశంలో కరోనా కట్టడికి మోడీ ఏమీ చేయలేదన్న విమర్శలు మెల్లగా వస్తున్నాయి. ఇక కేసీయార్ లాంటి ముఖ్యమంత్రులైతే రాష్ట్రాలను మోడీ ఏ విధంగానూ ఆదుకోవడంలేదని కూడా అంటున్నారు.

 

ఈ టైంలో కాంగ్రెస్ సైతం గొంతు సవరించుకుని మోడీని టార్గెట్ చేస్తోంది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం మాత్రం మోడీ చుట్టూ తిరుగుతోంది. మోడీ ది గ్రేట్ అంటున్నారు చంద్రబాబు.ఆయన లాక్ డౌన్ని విజయవంతంగా అమలు చేశారని,కరోనాను అదుపులో ఉంచారని చంద్రబాబు బాగా కీర్తిస్తున్నారు.

 

అయితే ఇపుడు టీడీపీలో దీని మీద చర్చ సాగుతోందిట. మోడీ గ్లామర్ పొలిటికల్ గా తగ్గిపోతున్న దశలో ఆయన్ని భుజాన వేసుకోవడం మంచిది కాదని పచ్చ పార్టీలో సీనియర్లు అంటున్నారుట. మోడీకి వ్యతిరేకంగా గొంతు విప్పితేనే జనంలో తెలుగుదేశం పరువు మర్యాదా నిలబడతాయని అంటున్నారుట.

 

ఈ మేరకు మహానాడులో తీర్మానం చేయమని కూడా అంటున్నారని టాక్. కేంద్రంలోని బీజేపీ విధానాలను విమర్శిస్తూ మహానాడు కనుక తీర్మానాలు చేస్తే అది నిజంగా ఆశ్చర్యకరమే. కానీ బాబు అలా చేయగలరా. ఇప్పటికైతే పార్టీలోని మాజీ మంత్రులు reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు మోడీని, జగన్ని కలిపి విమర్శలు చేస్తున్నారు. చూడాలి మరి. 

 

ఇప్పటికే ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీయార్ బాబుకు బధ్ధ విరోధులుగా ఉన్నారు. మోడీ కూడా దూరమే కానీ దగ్గరకు చేరాలని బాబు ప్రయత్నం. ఇపుడు అక్కడా ఢీ కొడితే టీడీపీ గతేం కానూ

 

మరింత సమాచారం తెలుసుకోండి: