బీజేపీ పార్టీ ఎప్పటినుండో దక్షిణాది రాజకీయాలలో పాతుకు పోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో మినహా దక్షిణాదిలో ఎక్కడా కూడా బిజెపి పార్టీకి అంత పట్టు లేదు. అటువంటిది గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నీ బీజేపీ అధిష్టానం నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఓటు బ్యాంకు కీలకం కావటంతో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ నీ అధ్యక్షుడిగా నియమించడంతో చాలావరకూ కాపు ఓటుబ్యాంకు పార్టీకి ఫేవర్ అవుతుందని బీజేపీ పెద్దలు భావించారు. 

 

తీరా జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ 2014 ఎన్నికల లో చూపించిన ప్రభావం కూడా చూపించలేకపోయింది. 2019 ఎన్నికలలో ఒక్క సీటు కూడా ఏపీలో గెలవలేక పోయింది. దీంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మంచి దూకుడుగా పరిపాలన చేయడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందేలా చేయడంతో బిజెపి పార్టీ ఆటలో అరటిపండు అయిపోయింది. అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా సరిగ్గా వ్యవహరించకుండా బిజెపి పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూసిన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు రావడంతో కన్నా సీటుకు బీజేపీ అధిష్టానం ఎసరు పెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. 

 

కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో అందరినీ కలుపుకోకుండా గ్రూపు రాజకీయాలు చేస్తూ ప్రత్యర్థి పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లటంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ వచ్చాక పార్టీ సభ్యత్వం కూడా సరిగ్గా పెరగకపోవడంతో కన్నా నీ పక్కన పెట్టాలని బిజెపి డిసైడ్ అయిందట. దీంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొత్తవారికి అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని ఏపీ రాజకీయాల్లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. ఇదే సమయంలో బిజెపి తో జనసేన పార్టీ కలసి పని చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కి పగ్గాలు ఇచ్చే చాన్స్ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: