ప్రపంచంలోని కరోనా మహమ్మారి వల్ల ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అందరికీ తెలిసిందే.  కరోనా మహమ్మారి ఇప్పటికి ఎందరో ప్రాణాలను బలిగొంది. కనీసం చనిపోయాకైనా ఆ మృతదేహాన్ని ముట్టుకునే వీలులేకుండా చేస్తోంది.  అమెరికాలో అయితే దారుణమైన మరణాలు సంబవిస్తున్నాయి.  కుప్పలు తెప్పులుగా శవాలను ఒకే గుంతలో పూడ్చిపెట్టడం వంటి దారుణాలు అమెరికాలో చూస్తున్నాం. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ను మనో వేదనకు గురిచేశాయి.  ఇక కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వీడే పరిస్థితి కనిపించడం లేదు.

 

రోజురోజుకూ మరింతగా బలపడుతూ విస్తరిస్తున్న వైరస్, గడచిన 24 గంటల్లో లక్ష మందికి సోకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 51.32 లక్షలకు పెరిగింది. కాగా, ఒక్క అమెరికాలోనే కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలను దాటడం గమనార్హం.  కుప్పలు తెప్పులుగా శవాలను ఒకే గుంతలో పూడ్చిపెట్టడం వంటి దారుణాలు అమెరికాలో చూస్తున్నాం. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ను మనో వేదనకు గురిచేశాయి.

 

దీంతో ఆసుపత్రి పడకలనే శవపేటికలుగా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది.  ‘మెటల్‌ రెయింగ్స్‌‌తో ఈ బెడ్లను తయారుచేశాం. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు ఉంటాయి. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. ఈ బయోగ్రేడబుల్‌ బెడ్‌- కఫిన్స్‌ 92 నుంచి 132 డాలర్లకు లభించేలా తయారు చేస్తున్నాం. ఈ బెడ్లను తొలుత కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆసుపత్రికి విరాళంగా ఇస్తున్నాం’ అని రొడాల్పో చెప్పారు. బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేస్తున్నామని తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: