తెలుగుదేశం పార్టీకి మహానాడు అత్యున్నత  పార్టీ వేదిక. అక్కడ కార్యకర్తలు, నాయకులు కలుసుకుంటారు. ముఖాముఖీ సమావేశం అవుతారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకుంటారు. ఓ విధంగా పార్టీ వర్తమానాన్ని సమీక్షించి భవిష్యత్తులు బాటలు వేస్తుంది మహానాడు. 

 

అటువంటి మహానాడు రెండేళ్ళుగా జరగడంలేదు. ఈసారి మాత్రం కరోనా మహమ్మారి ఉన్నా కూడా ఎలాగోలా నిర్వహించాలని అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహానాడును జూమ్  వీడియో సమావేశాల ద్వారా నిర్వహించాలని అనుకుటున్నారు. చంద్రబాబు ఎటూ హైదరాబాద్ లోని ఇంటిలోనే ఉంటారు. ఇక పార్టీలో  నాయకులు కూడా ఎవరి ఇళ్ళలో వారు,  పెద్ద నాయకులు,   సీనియర్లు అయితే దగ్గరలోని పార్టీ ఆఫీసుల్లో చేరి మహానాడులో పాలుపంచుకుంటారని అంటున్నారు.

 

ఈ మహానాడులో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి చర్చిస్తారని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. దాంతో సహజంగా ఆ సర్కార్ని విమర్శిస్తారని అంటున్నారు. ఇక బీజేపీ మీద, కాంగ్రెస్ మీద టీడీపీ అభిప్రాయం ఏంటో ఈ మహానాడులో తెలుస్తుందా అన్నది ఒక చర్చగా ఉంది.

 

అదే విధంగా ఎన్నికల తరువాత జనసేనను ఒక్క మాట అనకుండా బాబు వెనకేసుకువస్తున్నారు. మరి జనసేనతో భవిష్యత్తు బంధాలు ఎలా ఉంటాయన్నది కూడా ఏమైనా స్పష్టత ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా మహానాడుతో పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు గట్టి ప్రణాళికలే సిధ్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. చూడాలి మరి.

 

ఇదిలా ఉంటే క్యాడర్లో మునుపటి జోష్ లేదు. పార్టీ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ఏడాది అవుతున్నా కూడా ఎక్కడా పుంజుకున్న దాఖలాలు లేవు. ఏదో బాబు వ్యూహాలతో మేనేజ్మెంట్ ఎత్తుగడలతో వైసీపీ మీద పై చేయి అని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా పార్టీ బలం తగ్గిందన్న భావన ఉంది.  మరి బాబు ఏ రకంగా దారిలో పెడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: