ప్రజలకు మంచి చేసే విషయంలో సీఎం జగన్ ఎలాంటి డిమాండ్లు వచ్చిన వాటిని నెరవేర్చడంలో ముందే ఉంటారు. అయితే ప్రతిపక్షాలు ఎప్పుడు రాజకీయ పరంగా అమలు సాధ్యం కాని డిమాండ్లు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. కానీ వారి డిమాండ్ల కంటే ముందే జగన్ ఊహించని విధంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటీవల విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో కూడా ప్రతిపక్షాలు బాధితులకు 25 లక్షల సాయం చేయాలని అడిగారు.

 

కానీ జగన్ మాత్రం కోటి రూపాయలు సాయం చేసి, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా చేశారు. ఇక ఇటు కరోనా సమయంలో ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసం పని చేస్తున్న పోలీసులు, డాక్టర్లకు అండగా నిలిచారు. వారికి బీమా సౌకర్యం కల్పించారు. ఇదే సమయంలో టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్‌కు లేఖ రాసి ఓ మంచి డిమాండ్ చేశారు.

 

అంగన్‌వాడీ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని, కరోనా సమయంలో జీవితాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్నారని, ఇంటింటికీ వెళ్లి చేస్తున్న వారి కృషి అభినందనీయని చెప్పారు. అలాగే ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద హెల్త్‌కేర్‌ వర్కర్లకు బీమా అందిస్తున్నారని, ఈ జాబితాలో అంగన్‌వాడీ వర్కర్లని చేర్చాలని, ప్రభుత్వం చొరవ తీసుకొని అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50లక్షల బీమా అందేలా చూడాలని లోకేశ్ కోరారు.

 

అయితే జగన్ ముందు లోకేశ్ మంచి డిమాండే పెట్టారనే చెప్పుకోవచ్చు. రాజకీయం జోలికి పోకుండా అంగన్‌వాడీ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని కోరడం మంచి విషయమే. కరోనాపై పోరాడటంలో డాక్టర్లు, నర్సులు కృషితో పాటు, అంగన్‌వాడీ వర్కర్ల కష్టం కూడా ఉంది. అందుకే వారి కష్టానికి తగ్గట్టుగా వారికి బీమా సౌకర్యం కల్పించాలని లోకేశ్ అడుగుతున్నారు. మరి చూడాలి జగన్...లోకేశ్ డిమాండ్‌ని పరిగణలోకి తీసుకుంటారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: