కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా మొదటి నుంచి చైనా ప్రభుత్వం పై గుర్రు గానే ఉన్న విషయం తెలిసిందే. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి అమెరికా ప్రభుత్వం చైనా పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. వైరస్ ను ఎందుకు సృష్టించారు.. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేలా చేశారు... అంటూ  తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అమెరికా. అయితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి.. తమ ఆధీనంలోకి భారత పాలన వ్యవస్థను తీసుకోవాలని... చైనా ప్రభుత్వం అటు పాకిస్థాన్ నేపాల్ దేశాలతో ఎలా అయితే భారత్కు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తోంది. అమెరికా కూడా అదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 

 


 ఎందుకంటే అమెరికా సహా అమెరికా మిత్ర దేశాలు చైనా లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకుండా అమెరికా అడ్డుకుంటుంది. దీంతో అమెరికా చేస్తున్న విమర్శలకు ఇప్పటికే చాలా దేశాలు చైనా లో పెట్టుబడి పెట్టకుండా వెనకడుగు వేశాయి
 ఎంతోమంది తమ పెట్టుబడులను విత్ డ్రా చేసుకున్నారు. అయితే అటు అమెరికా కూడా ఏకంగా  చైనాకు చెందిన చాలా కంపెనీలను బ్లాక్లిస్టులో పెట్టింది. అయితే ఇది చైనాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఒక్కసారిగా ఇంత మొత్తంలో పెట్టుబడి లనీ  రానివ్వకుండా చేయడం... చైనా  కంపెనీ లని బ్లాక్ లిస్టులో పెట్టడం చైనాకు భారీగా నష్టం కలిగించే అంశం. 

 

 అయితే ఈ విషయంలో అటు చైనా ప్రభుత్వం మాత్రం చాలా ధైర్యంగా వ్యవహరిస్తోంది . ఎందుకంటే మొదట మూడు నాలుగు రోజులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ... చివరికి ఉత్పత్తుల కోసం చైనా వద్దకు అమెరికా మళ్లీ రావాల్సిందే . ఎందుకంటే చైనాలో కేవలం వంద రూపాయల తో ఉత్పత్తి అయ్యే వస్తువులు అమెరికాలో ఉత్పత్తి చేయడానికి ఏకంగా వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే రెండు రోజుల వరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ చివరికి ఉత్పత్తుల కోసం దగ్గరికి రావాల్సిందే అని చైనా ధీమాతో ఉంది . ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా  తీసుకున్న నిర్ణయం సరైనదేనా.. అమెరికా మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా  అన్నది చూడాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: