ప్రస్తుతం భారతదేశంలో భారత్కు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే మాధ్యమాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇందులో భారత్కు వ్యతిరేకంగా ఎప్పుడు వ్యవహరించే మాధ్యమాలలో ఒకటి ఎన్డీటీవీ .. ఎన్డి టీవీ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతు ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి... భారత్ కి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేయడమే కాదు.. మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తుంది అని ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. కానీ వాటిని  మాత్రం ఏదీ పట్టించుకోదు.. కేవలం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇలా ఎన్డి  టీవీ వ్యతిరేక విమర్శలు చేస్తోంది. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో మాత్రం ఇలాంటి విమర్శలకు పోలేదు ఎన్డి టీవీ

 


 అయితే తాజాగా ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థలో  కీలక ఉగ్రవాది ఫైనాన్షియర్ అయినా ఓ కీలక ఉగ్రవాదిని  అమెరికా అరెస్ట్ చేసి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి ప్రస్తుతం భారత దేశానికి అప్పగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక తీవ్రవాదిని అమెరికా భారత్కు అప్పగించడానికి తప్పుగా చిత్రీకరించింది ఎన్డి టీవీ  భారత్కు చెందిన ఇంజనీరు అమెరికా భారత్ కి అప్పగిస్తుంది అంటూ వార్త రాశారు. అయితే భారత్కు చెందిన ఇంజనీరు ఆల్ ఖైదా కూ  కోసం నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేశారు అంటూ ఆరోపించింది. 

 


 అంటే ఒక ఉగ్రవాదినీ  ఉగ్రవాది అని సదరు మీడియా అంగీకరించలేక పోతున్నది. అయితే అమెరికా భారత్ కూ అప్పగించే  ఉగ్రవాది ముఖ్యంగా భారత్ లో ఎంతో విధ్వంసం సృష్టించడానికి కారకుడైనాడు. అలాంటి ఉగ్రవాదిని ప్రస్తుతం ఉగ్రవాది కాదు అంటూ చిత్రీకరించేలా  ఆ మీడియా సంస్థ కథనాలు ప్రచురితం చేస్తోంది. అయితే మోడీని ప్రధాన ఉగ్రవాద నాయకుడు అని  చిత్రీకరించి మోదీకి సహాయకుడిగా అమిత్ షాను చిత్రీకరించి ప్రధానమంత్రి పదవికి రాకుండా చేయాలన్నది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని అటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు మోడీ అధికారంలోకి రాక ముందు ఈ కుట్ర ఏకంగా న్యాయస్థానాలు అంగీకరించే పరిస్థితి కూడా తీసుకువచ్చారు అని అంటున్నారు. ఇలా భారతదేశాన్ని నెగటివ్ గా చూపించడంలో ఉన్న మాధ్యమాలలో  ఇది కూడా ఒకటి అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: