ఇండియాలో కరోనా వైరస్ చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఈ వైరస్ దేశంలో ఎంట్రీ ఇవ్వటంతో కేంద్రం లాక్ డౌన్ మార్చి నుండి అమలు చేస్తూనే ఉంది. ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇంటి నుండి బయటకు రానివ్వకుండా కట్టుదిట్టంగా దాదాపు 50 రోజులు లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేశారు. దీంతో మొదటి లో కరోనా వైరస్ ఇండియాలో అంతగా ప్రభావం చూపలేదు. ఈ సందర్భంలో అంతర్జాతీయ దేశాలు కరోనా వైరస్ పై చేస్తున్నా యుద్ధంలో ఇండియా అద్భుతంగా పోరాడుతుంది అంటూ తెగ పొగిడేశారు. ఆ తర్వాత సీన్ చూస్తే ఢిల్లీ వేదికగా జరిగిన మత ప్రార్థనలు వల్ల ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయంకరంగా బయటపడ్డాయి.

 

ఢిల్లీ వేదికగా జరిగిన తాబ్లికి జమాతే మత ప్రార్థనల వల్ల దేశంలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరించింది. అప్పటిదాకా దేశం లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒకలా ఉంటే తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ముఖ్యంగా మహారాష్ట్రలో భయంకరంగా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ కేసులు అత్యధికంగా ఇండియా లో నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మహారాష్ట్రలో వైరస్‌ విలయ తాండవం కొనసాగుతోంది. 50వేలకు చేరువవుతున్నాయి పాజిటివ్‌ కేసులు. ఒక్క ముంబైలోనే 27వేల కేసులు నమోదయ్యాయి. కొత్తగా అక్కడ 2,345 కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.

 

ఇదిలావుండగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వైరస్ కోసం పోరాటం చేస్తున్న పోలీసులను వైరస్ గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వైరస్ తో పోరాడుతున్న సమయంలో పోలీసులు కూడా మరణించడం జరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 1666 మంది పోలీసుల‌కి క‌రోనా సోక‌గా, 18 మంది మ‌ర‌ణించారు. వరుసగా పోలీసులు వైరస్ వల్ల మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. పోలీసులకు తగిన జాగ్రత్తలు వాళ్ల సెక్యూరిటీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: