ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్న కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే 53 లక్షల మంది ప్రభావితం అయిన విషయం తెలిసిందే. ఇక ఒక్క అమెరికాలోనే దాదాపు లక్ష మంది చనిపోయారు అంటే దాని తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశాలు దశలవారీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా.... వైరస్ వ్యాప్తి లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. దీంతో అందరి చూపు కరోనా వ్యాక్సిన్ పైనే ఉంది.

 

ఇటువంటి సమయంలో లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.... వ్యాక్సిన్ ట్రయల్స్ పై స్పీడు పెంచింది. తొలి దశలో వెయ్యిమందికి ప్రయోగం చేసిన యూనివర్సిటీ ఇప్పుడు రెండవ దశలో 10 వేల మందిపై టెస్ట్ చేయబోతున్నారు. అయితే సమయంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.

 

క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్ అంశాల్లో సుప్రసిద్ధ పరిశోధనలు చేసినా విలియమ్ హసల్టైన్ ఒక సంచలన కామెంట్ చేశారు. కోవిడ్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందన్న విషయాన్ని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరని.. అన్నీ పరిశోధనలను మంచి ఫలితాన్ని సాధించి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అనుమానాస్పదమే అని ఆయన అన్నారు.

 

ఇక డౌన్ ఎత్తివేత పై తీవ్రంగా స్పందించిన ఆయన భౌతిక దూరం, సరైన పరిశుభ్రత వంటివి పట్టించుకోకుండా లాక్ డౌన్ ఎత్తివేత లేదా సడలింపులు పేరుతో ప్రజలను రోడ్లపై ఇష్టమొచ్చినట్లు తిరగనివ్వడం వంటివి చేస్తే వైరస్ సృష్టించే పెను ప్రమాదం నుండి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

 

అయినా గత కొద్ది రోజులుగా మనదేశంలో కరోనా వైరస్ అంటే ఏమాత్రం భయం లేకుండా తిరుగుతున్న జనాల్ని చూస్తే వ్యాక్సిన్ రాకపోయినా వారంతా చిందించే పనిలో లేనట్లు తెలుస్తోంది.

 

కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మాత్రం వ్యాక్సిన్పై ధీమాగా ఉంది. యూకేకు చెందిన బయోఫార్మాసూటికల్ కంపెనీ ఆస్ట్రజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ రీసెర్చ్ టీమ్ పని చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ డెవలప్ చేసి పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: