కరోనా దాటికి విధించిన లాక్ డౌన్ దెబ్బకు చతికిలపద్ద అనేక రంగాల్లో సినీరంగం ప్రధానమైనది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా పొడిగించిన లాక్ డౌన్ లో అనేక సడలింపులు ఇచ్చిన ధైర్యంతో సినీ ప్రముఖులు అంతా కలిసి మళ్ళీ తమ ఇండస్ట్రీని చక్కదిద్దే పనిలో కీలకమైన అడుగులు వేసిన విషయం తెలిసిందే. ముందు వారంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ తో భేటీ అయిన విషయం తెలిసిందే.

 

తర్వాత వారి బాధలను విన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు సినిమా షూటింగ్ లకు ఓకే చెప్పేశారు. దీనితో లాక్ డౌన్ వల్ల నెలకొన్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్లు అయింది. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావడంతో టాలీవుడ్ ప్రముఖులు అంతా సంతోషంగా ఉన్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీఎం ను షూటింగ్ కు పర్మిషన్ అడిగి మరొక ముఖ్యమంత్రిని విస్మరిచారు ఏమి అన్నది సోషల్ మీడియాలో ప్రధాన ప్రశ్నగా మారింది.

 

తెలంగాణ సీఎం ఓకే అంటే సరిపోదు ఏపీ సీఎం జగన్ అంగీకారం కూడా ఇందుకు ఉండాలి అనే విషయాన్ని కొందరు ప్రస్తావించడంతో టాలీవుడ్ ప్రముఖులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. షూటింగ్ లను తెలంగాణకు పరిమితం చేద్దాం కానీ ఆంధ్ర ప్రదేశ్ సంగతి ఏమిటి? ఆంధ్రలో ఉన్న సినీ ప్రముఖులు మరియు ఆర్టిస్టులు తెలంగాణకు వచ్చి షూటింగ్ లో పాల్గొనడం.. లేదా ఆంధ్రలో షూటింగ్ జరుపుకునేందుకు పర్మిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అనుమతి లేకుండా సాధ్యపడే విషయమేనా...?

 

అసలు సదరు అనుమతులను తెలంగాణ సీఎం ను ఎలా కోరారో ఏపీ ముఖ్యమంత్రి ని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అని ఇప్పుడు ఉత్పన్నమవుతుంది ప్రశ్నలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. విషయంలో పట్టింపులకు పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు కానీ నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తి మాట టాలీవుడ్ ప్రముఖులపై బాగానే పని చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: