అదేంటోగాని కొన్ని కొన్ని సార్లు జరిగే చిత్రవిచిత్రమైన ఘటనల ద్వారా షాకవ్వాల్సిన  పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఘటనలో ఎవరు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది... డెలివరీ బాయ్ 10 నిమిషాలు ఆలస్యంగా రావడం కారణంగా ఏకంగా ఒక యువతి గర్భం దాల్చింది. అదేంటి పది నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల గర్భం దాల్చడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారు కదా... కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది. ఓ యువతి ఆర్డర్ చేసిన వస్తువును డెలివరీ బాయ్ 10 నిమిషాలు ఆలస్యంగా తేవడం  కారణంగా యువతి గర్భం దాల్చిన ఘటన చైనా లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జియాంగ్సు  ప్రావిన్స్  లోని క్సుసు  ప్రాంతానికి చెందిన సు అనే యువతి.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇంట్లో సరదాగా సినిమా చూసింది. 

 


 ఇక అప్పటికే చీకటి పడడంతో తన బాయ్ ఫ్రెండ్ ఆమె ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. కానీ రాత్రి సమయంలో ఏదైనా జరగకూడనిది జరిగితే... తన బాయ్ ఫ్రెండ్ నిగ్రహం కోల్పోతే... ఎలా అని భావించిన ఆ యువతి వెంటనే ఆన్లైన్లో కాండోమ్  ప్యాకెట్ ని ఆర్డర్ చేసింది. ఇక కాండం ప్యాకెట్ డెలివరీ అయ్యేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది అని ఆన్లైన్ లో చూపించింది. ఇంతలో తన బాయ్ ఫ్రెండ్ తన వైపు రొమాంటిక్ గా చూడటం మొదలుపెట్టాడు. ఇక తన బాయ్ ఫ్రెండ్ ని ఎలాగైనా 20 నిమిషాల పాటు దరిచేరనీయకుండా ఉంచాలి అంటూ నిశ్చయించుకుంది ఆ యువతి. 

 


 దీంతో బాత్రూం వెళ్లి 20 నిమిషాల పాటు స్నానం చేసింది. ఇరవై నిమిషాల తర్వాత బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటున్న  సమయంలో అకస్మాత్తుగా ఆ యువతి బాయ్ ఫ్రెండ్ గది లోకి వచ్చేశాడు. ఇంకేముంది మెల్లిమెల్లిగా దుకాణం పెట్టేసాడు. ఈ క్రమంలోనే ఆ యువతి ఆర్డర్ ఇచ్చిన కండోమ్ గురించి  మరచిపోయి నిగ్రహం కోల్పోయింది. దీంతో ఆ గదిలో ఆ ఇద్దరు బాగానే శృంగారంలో మునిగితేలారు. ఇక కాసేపయ్యాక కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని బయటకు వెళ్లి డోర్ తెరిచి చూసేసరికి డెలివరీ బాయ్ కండోమ్  ప్యాకెట్ పట్టుకొని నిలుచున్నాడు. ఇంకేముంది కండోమ్ ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చాను అని గుర్తు వచ్చిన యువతి ఆ డెలివరీ బాయ్ పది నిముషాలు ఆలస్యంగా వచ్చినందుకు గట్టిగానే తిట్టిపోసింది. ఆ తర్వాత కండోమ్  ప్యాకెట్లు తీసుకొని డెలివరీ బాయ్  పంపించేసింది . ఆ తర్వాత నెల రోజులకు ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో షాక్ అయిన ఆ యువతి డెలివరీ బాయ్ కారణంగానే తాను గర్భందాల్చను  అంటు... ఆ డెలివరీ బాయ్ పై దావా  కూడా వేసింది. దీనిపై స్పందించిన డెలివరీ బాయ్ ఆమె గర్భానికి  నేను కారణం అవుతానని అనుకోలేదు ఈ విషయాన్ని నా  సంస్థ చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: