ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేలా అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తున్నాయి. కండక్టర్లు లేకుండా నగదు రహిత కార్యకలాపాలకు ఆర్టీసీ ప్రాధాన్యత ఇచ్చింది. 436 మార్గాల్లో 1,700కు పైగా బస్సులు నడుపుతూ పరిమిత సీట్లలోనే ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. 
 
అయితే నాన్ ఏసీ ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్టీసీ తాజాగా ఏసీ బస్సులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ ఒంగోలు, గుంటూరులకు బస్సు సర్వీసులు నడపలేదు. అయితే గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాత్రి సమయంలో కూడా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అమరావతి, మెట్రో లగ్జరీ, వెన్నెల ఏపీ బస్సులను ఈరోజు రాత్రి నుంచి నడపనున్నారు. 
 
దూర ప్రాంతాలకు ఈ బస్సు సర్వీసులను నడపనున్నారని తెలుస్తోంది. బస్సుల్లో 26 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. ఈరోజు నుంచి విశాఖ - విజయవాడ మార్గంలో 18 ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రోజులుగా తిరుగుతున్న బస్సుల్లో దూర ప్రాంత సర్వీసులకు ఆదరణ మొదలైంది. రాయలసీమ జిల్లాలకు తిరిగే బస్సులకు డిమాండ్ పెరిగింది. 
 
లాక్ డౌన్ వల్ల ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వారు సొంతూళ్లకు వెళ్లడానికి ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే బస్ స్టేషన్లను ప్రయాణికులు ప్రయాణమవుతున్నారు. అధికారులు విశాఖ జిల్లాకు భారీ సంఖ్యలో సర్వీసులు నడుపుతున్నా ప్రయాణికుల నుంచి విశాఖకు బస్సు సర్వీసులు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే బస్ స్టేషన్లకు ప్రయాణికులు చేరుకుని టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: