కరోనా నేపథ్యంలో జరుగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీల కోసం ప్రత్యేకంగా సైనిక్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు రాష్ట్రాల నుంచి వలస కూలీలు తరలించేందుకు భారత రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో రైల్వేశాఖ రైళ్ళను ఎలా శుభ్రం చేస్తుంది..? ఎలా శానిటైజర్ చేస్తున్నారో తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో ప్రతి రైలును లోపల, బయట కూడా పూర్తిగా శానిటైజర్ చేస్తున్నామని అలాగే ప్రయాణికులంతా కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా చేస్తున్నామని భారత రైల్వే శాఖ తెలిపింది.

ప్రతి వ్యక్తి ఫేస్ మాస్క్, లేదా కర్చీఫ్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకోవాలని థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత వారిని స్టేషన్లోకి అనుమతిస్తారని, అంతే కాకుండా అందరూ కచ్చితంగా హ్యాండ్ శానిటైజర్ చేసుకునేలా చేస్తున్నామని రైల్వే శాఖ ఆ వీడియోలో వివరించింది. ముఖ్యంగా రైళ్లలో కోచ్ లు శుభ్రం చేసుకునే చోట ప్రయాణికుల కోసం లిక్విడ్ హ్యాండ్ వాష్ శానిటైజర్ లను ఉంచినట్లు రైల్వేశాఖ అందులో తెలిపింది.

 

అంతే కాక కేవలం టికెట్లు కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ప్లాట్ ఫామ్ దగ్గర, సీట్ లో కూర్చునేటప్పుడు, రైల్లో ఎక్కేటప్పుడు కచ్చితంగా బౌతిక దూరం పాటించే విధంగా చూస్తున్నట్లు ఈ వీడియోలో రైల్వే శాఖ చూపించడం జరిగింది. భౌతిక దూరం ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అంతేకాకుండా రైల్వే శాఖ చేపట్టిన ఈ సేవలు చాలా బాగున్నాయి అని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. శ్రామిక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి బయలుదేరిన సందర్భంగా భారత రైల్వే శాఖ ఈ వీడియోని మినిస్టరీ ఆఫ్ రైల్వేస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వార పోస్ట్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: