మామూలుగా వేసవికాలం వచ్చిందంటే చాలు మహిళలు మధ్య  నీటి కోసం  గొడవలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక నీటి కోసం మహిళలు మధ్య తలెత్తిన  గొడవలు మామూలుగా ఉండవు. ఇద్దరు మహిళలు గొడవ పడితే  చుట్టుపక్కల ప్రాంతం మొత్తం రచ్చరచ్చగా మారిపోతుంది. కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ఇద్దరు మహిళల మధ్య నీటి కోసం జరిగిన గొడవ ఏకంగా రెండు గ్రామాల మధ్య గొడవ గా మారిపోయింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం కాదు ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక చివరికి పోలీసులు వచ్చి  అక్కడ పరిస్థితి అదుపు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 

 

 వివరాల్లోకి వెళితే... నీటి విషయమై మహిళల మధ్య ఏర్పడిన గొడవ... ఏకంగా చిలికి చిలికి గాలి వాన అయినట్లు... రెండు గ్రామాల మధ్య గొడవలు. చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం నక్కల దీన్నే వడ్డేపల్లి... కె.వి పల్లి నూతన కాలువ గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నీళ్లు తెచ్చుకునే క్రమంలో ముందుగా ఇరు  గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు ముందుగా తగాదాకు దిగారు. ఇక ఇద్దరు మహిళల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్రంగా ధూషించుకోవటం  మొదలుపెట్టారు. ఇక ఈ వివాదం ఆ రెండు గ్రామాల వరకు చేరింది. 

 

 ఇద్దరు మహిళల మధ్య నీటి కోసం తలెత్తిన వివాదం కాస్త గ్రామాల ప్రజల మధ్య వివాదంగా మారి పోయింది. దీంతో రెండు గ్రామాల ప్రజలు పరస్పరం మాటల దాడికి దిగి ఏకంగా చేతల దాడి కూడా చేసుకునేంత వరకు వెళ్లారు. రాళ్లు బీరు సీసాలతో దాడి  చేసుకున్నారు. ఇక అక్కడ బైక్ లకి  ఏకంగా నిప్పంటించారు. ఈ ఘటనలో పలు కార్లు ద్విచక్ర వాహనాలు సైతం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులు ఈ ఘటనలో కలుగ చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో  భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: