తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల విషయంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్లు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదు. కరోనా వైరస్ టెస్టులు సరిగా చేయకుండా వాస్తవ కేసుల సంఖ్య బయట పెట్టకుండా కేసీఆర్ నాటకాలాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. పైకి కల్లబొల్లి కబుర్లు చెబుతున్న కానీ రాష్ట్రంలో వైరస్ భయంకరంగా విస్తరించి ఉందని చాలామంది అంటున్నారు. ఇటువంటి సమయంలో బిజెపి పార్టీ కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించడానికి రెడీ అయింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల వివరాలను కేసీఆర్ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. 

 

అదే విధంగా ప్రజల కోసం కష్టపడుతున్న ప్రభుత్వ సిబ్బందికి కూడా తెలంగాణ ప్రభుత్వం వైద్య పరీక్షలు చేయటం లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అనుమానితులకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. కరోనా పరీక్షలు చేయకపోవడం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ చెప్పిన కరోనా రహిత తెలంగాణ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. కరోనాతో మరణించిన వారి వివరాలు కూడా వెల్లడించడంలేదని బండి సంజయ్ అన్నారు.

 

ప్రభుత్వం స్పందించి కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయాలి అని తెలిపారు. ఇదే సమయంలో కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వైద్యపరీక్షలు ఎక్కువగా జరగడం లేదని అనడం గమనార్హం. ఈ విధంగా వ్యవహరిస్తే వైరస్ భయంకరంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతుందని, పరిస్థితి దారుణం గా మారుతుందని ఇటీవల కేసీఆర్ సర్కార్ కి సూచనలు ఇచ్చారు. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కొద్ది కేసులు బయటపడటం తెలంగాణ ప్రభుత్వానికి టెన్షన్ పెట్టిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: