ఎన్నో ఆర్ధిక ఇబ్బందులతో విదేశాలకు వలసవెళుతున్న వలస కార్మికుల దుస్థితి వర్ణనాతీతం. కడుపు తిప్పల కోసం ఉన్న ఊరిని , సొంత మనుషులను వదిలి ఏదో సాధిద్దాం అని  విదేశప్రయాణం చేస్తున్నారు వలస కార్మికులు. ఆదేశాలలో యజమానులు పెడుతున్న చిత్రహింసలను భరించలేక మళ్లీ సొంతవూరుకు ప్రయాణం అవుతున్నారు వలస కార్మికులు. మరి కొంతమంది పరిస్థితి దారుణం ఎందుకంటె తిరుగు ప్రయాణానికి డబ్బులేక యజమాని సరిగ్గా డబ్బులు ఇవ్వక అక్కడే నిలిచిపోతున్నారు. కొంతమంది యజమాని పెట్టె టార్చర్ భరించలేక సొంతూరుకు తన పరిస్థితిని వివరిస్తూ వీడియోలు పెట్టి కాపాడమని అర్థిస్తున్నారు.

IHG

 

 

తాజాగా సౌదీ అరేబియాలో పనికోసం వెళ్లిన రవి అనే కార్మికుడు తన యజమాని పెట్టె టార్చర్ భరించలేక తనను కాపాడవలసిందిగా ఓ వీడియో ద్వారా తనను కడమని అర్థించిన  ఘటన యావత్ తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేసింది. అతడు ఘోరంగా యజమానిచేత హింసకు గురి అయ్యి ఒంటినిండా రక్తపు దారాలతో తమ సొంతవారికి ఆ విషయాన్నీ వీడియో కాల్ ద్వారా తెలియజేశాడు. అయితే ఆ విషయాన్నీ గమనించిన కల్వకుంట్ల కవిత గారు వెంటనే స్పందించి ఆ వ్యక్తి ని ఇండియా కు రప్పించే విధంగా జయశంకర్ గారికి సోషల్ మీడియా ద్వారా ఆ విషయంలో స్పందించవలసిందిగా కోరారు...

IHG

 

 

 

అయితే ఆమె తన సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసారు ...@DrSJaishankar ji, అతను తెలంగాణకు చెందిన రవి. అతను సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు. గత ఒక వారం నుండి మా రాయబార కార్యాలయం సహాయంతో ఈ వ్యక్తిని రక్షించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అయితే, విచారకరం ..ఈ రోజు ఆ పరిస్థితి విషమ స్థాయికి చేరుకుంది మరియు మీ తక్షణ జోక్యం అవసరం. దయతో ఈ మనిషికి సహాయం చెయ్యండి .." అంటూ కోరారు ...

 

 

 

 

 

 

ఇలాటి రవి లు ఎంతమందో లెక్కకు రాకుండా విదేశాలలో మగ్గిపోతున్నారు...మరియు వారి జాడ కొన్ని సంవత్సరాలు అయినా తెలియడం లేదు ..సౌదీలో యజమానులను జాలి దయ లేకుండా ..  నిదాక్షిణ్యంగా చంపేస్తున్న దాఖలాలు లేకపోలేదు ...అందరూ యజమానులు ఆలా ఉండనప్పటికీ ఇలాంటి క్రూరమైన యజమానులు చేత హింసకు గురి అవుతున్నవారిని కనిపెట్టి కాపాడవలసిన బాధ్యత ఎంతైనా సదరు ప్రభుత్వాలపైన ఉంది. సహలంలో స్పందించిన కల్వకుంట్ల కవితగారికి ఏపీ హెరాల్డ్ తరుపున కృతజ్ఞతలు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: