ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు నవరత్నాలను అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు. సీఎం జగన్ ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందించే వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని గత సంవత్సరం ప్రారంభించారు. 
 
అయితే ఈ పథకానికి కొన్ని చిక్కులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా సొంతంగా వాహనాలు కొని నడుపుకుంటున్నారు. అయితే కొందరు వాహనమిత్ర పథకానికి ధరఖాస్తు చేస్తున్న వాళ్లు ఏం చెబుతున్నారంటే దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... కాల్ సెంటర్ కు కాల్ చేస్తే గ్రామ సచివాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారని... గ్రామ సచివాలయంలో అడిగితే ఆర్డీవో ఆఫీస్ వెళ్లమని చెబుతున్నారని ఆర్డీవో ఆఫీస్ లో మాత్రం తమకేం సంబంధం లేదని చెబుతున్నారని మీడియాకు తెలిపారు. 
 
వెబ్ సైట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.... సమస్యకు పరిష్కారం లభించడం లేదని వారు చెబుతున్నారు. అధికారులు మాత్రం కొన్ని ఏరియాలలో ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉండవచ్చని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పథకానికి గడువు ముగియనుంది. కొంతమంది దరఖాస్తు చేసుకున్నామని చెబుతున్నా చేసుకోని వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. 
 
పొరపాటు ఎక్కడ జరిగిందో జగన్ సర్కార్ వెంటనే గుర్తించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సి ఉంది. వాహన యజమానులకు ఇబ్బందులు లేకుండా సహాయసహకారాలు అందించాల్సి ఉంది. వారికి దరఖాస్తు చేసుకోవడానికి మరో విధంగా అవకాశం కల్పించడం ద్వారా ఈ పథకానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వీరి విషయంలో జగన్ సర్కార్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: