ఎన్ని ఎదురుదెబ్బ‌లు తాకినా.. పాకిస్తాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. నిత్యం భారతదేశంపై నిందారోపణలు మోపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకు అరబ్ దేశాలను కూడా ఉపయోగించుకోవాలని చూసింది. భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదని, ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారని, భారత ప్రభుత్వం ముస్లింల‌ప‌ట్ల‌ తీవ్ర వివక్ష చూపిస్తోందని, కశ్మీర్‌ను ఆక్ర‌మించుకుంద‌ని ఆరోపణలు చేస్తూ ప్రపంచాన్ని నమ్మించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇదే విషయాన్ని అర‌బ్ దేశాలతో చెప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నది.

 

భారతదేశంలో ముస్లింలపై ఎలాంటి వివక్ష చూపడం లేదని స్వయంగా అర‌బ్‌దేశాలు చెప్పడంతో పాకిస్తాన్‌కు గట్టి షాక్ తగిలింది. క‌శ్మీర్ స‌మ‌స్య భార‌త్‌లో అంత‌ర్భాగ‌మ‌ని కూడా అర‌బ్ దేశాలు చెప్పాయి. అంతేకాకుండా అరబ్ దేశాలకు చెందిన కీలక ప్రముఖులతో ఫేక్ సోషల్ మీడియా ఖాతాల‌ను క్రియేట్ చేసి వారి పేరుతో భారత్‌పై నిందలు మోపేందుకు, భార‌త్‌-అర‌బ్ దేశాల మ‌ధ్య సంబంధాల‌ను చెడ‌కొట్టేందుకు ప్రయత్నాలు చేసి భంగ పడింది. ఇటీవల ఒక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆ ఫేక్ ఖాతాల‌ను గుర్తించి తొలగించిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ ఖాతాల‌న్న కూడా పాకిస్తాన్ నుంచే న‌డుస్తున్నాయ‌ని గుర్తించింది నిఘా సంస్థ‌. అయినా తన బుద్ధిని మార్చుకుని పాకిస్తాన్ మరోసారి భారతదేశంపై కుట్ర‌కు తెర‌లేపింది.

 

ఈసారి మాల్దీవులతో భారత్‌పై ఆరోపణలు చేయించడానికి ప్రయత్నించింది. భార‌త్‌లో ముస్లింల‌పై తీవ్ర వివ‌క్ష కొన‌సాగుతోంద‌ని ఆ దేశంతో చెప్పించేందుకు ప్ర‌య‌త్నం చేసింది. కానీ మాల్దీవులు ఇచ్చిన షాక్ తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం భారతదేశం అని.. భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయని, అందరూ సర్వమత సమానంగా జీవిస్తున్నారని, ఇక్కడ ఎలాంటి వివక్ష లేదని మాల్దీవులు ప్రకటించడంతో పాకిస్తాన్ దిమ్మతిరిగిపోయింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుని ముందుకు సాగుతుందో లేదో చూడాలి మరి..!

మరింత సమాచారం తెలుసుకోండి: