ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. చైనాలో పురుడు పోసుకున్న ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను  ప్రాణ భయంతో వణికిస్తోంది . ఇక ఈ మహమ్మారి వైరస్ వ్యాక్సిన్ కనుగొనేందుకు  ఎన్ని పరిశోధనలు జరుగుతున్నప్పటికీ సత్ఫలితాలు మాత్రం ఇవ్వడంలేదు. మరోవైపు అటు చైనాలో మాత్రం ఈ వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అయితే చైనాలో వుహాన్  నగరం లోని వైరాలజీ ల్యాబ్ లో ఈ మహమ్మారి వైరస్ ను తయారు చేశారు అని అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. 

 


 అయితే తాజాగా కరోనా  వైరస్ కు సంబంధించి చైనా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఉహాన్ వైరాలజీ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మాట్లాడుతూ తమ దగ్గర  మూడు జాతులకు చెందిన గబ్బిలాలకు కరోనా వైరస్ ఉందని కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సార్స్ కోవ్2  వైరస్ తో మాత్రం ఏది  సరిపోలడం లేదు అంటూ తెలిపారు. గబ్బిలాలు సహా ఇతర క్షీరదాల కారణంగా ఈ మహమ్మారి వైరస్ మనుషులకు సంక్రమించినట్లు అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ కేవలం క్షీరదాలు  నుంచి వచ్చింది కాదు అని ఊహాన్ వైరాలజీ ల్యాబ్ లో సృష్టించారు అంటూ అమెరికా అధ్యక్షుడు సహా పలువురు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వుహాన్ వైరాలజి  ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వాంగ్ యాన్యు తెలిపారు. 

 


 అయితే వుహన్ వైరాలజీ ల్యాబ్ లో జంగ్లీ నేతృత్వంలోని బృందం 2004 నుంచి గబ్బిలాల్లో  కరోనా  వైరస్ గురించి పరిశోధనలు చేస్తోంది అంటూ తెలిపిన ఆయన.. దాదాపు రెండు దశాబ్దాల కింద సార్స్  వ్యాప్తి చెంది  ఎంతగానో ప్రాణ నష్టం కలిగించిన వైరస్ మిశ్రమాలను కనిపెట్టేందుకు తాము దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా  వైరస్ కు సంబంధించినటువంటి జన్యువులు వైరస్ తో పోల్చి చూస్తే కేవలం 80 శాతం మాత్రమే సార్స్ జన్యువులు  సరిపోలుతన్నాయని.. ఈ రెండు వైరస్ ల మధ్య స్పష్టమైన తేడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఊహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చింది అంటు అమెరికా దేశం కుట్రపూరితంగా  దుష్ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: