కుక్క కున్న విశ్వాసం కూడా మనిషికి లేదు అని అంటూనే ఉంటారు పెద్దలు. ప్రస్తుత రోజుల్లో మనిషి కంటే కుక్కకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. మరి కొందరు అయితే కుక్కలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ... ఇక కుక్క మొరిగింది అని ఫ్రస్ట్రేషన్‌ కి తో ఒక వ్యక్తి దాని పై తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. రెండుసార్లు ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. ఇక బుల్లెట్లు గురి తప్పడంతో... చివరికి ఆ యువకుడి ప్రాణాల మీదికి వచ్చింది.


ఊర్లో వారంతా జత కట్టి చితకబాదాడు. ఇకపోతే అతనికి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... జిల్లాలోని బెలాధి గ్రామానికి చెందిన వినోద్ రామ్ ను తన పెంపుడు కుక్క ఇంటి పక్కనే జీవనం కొనసాగిస్తున్న గోపాల్ రామ్‌ ని చూసి మూలగడం మొదలు పెట్టింది. ఒక కుక్క పెద్దగా కేకలు పెట్టడంతో గోపాల్ రామ్‌ ఫ్రస్ట్రేషన్ కు గురి అయి ఇంట్లోకి వెళ్లి తుపాకి తెచ్చి రెండు సార్లు కుక్క పై కాల్పులు జరపడం జరిగింది. 

ఇక బుల్లెట్లు గురి తప్పడంతో కుక్కకి తగలకుండా దూసుకుపోయాయి. ఎలాగోలా కుక్క మాత్రం బయట పడింది. ఇది ఇలా ఉండగా అందులో ఒక బులెట్ ఆ పక్కనే ఉన్న వినోద్ రామ్ కూతురు భూమిక చేతిలోకి దూసుకుపోవడం జరిగింది. బుల్లెట్ బాలికకు తగలడంతో స్థానికులు గోపాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్లో వారంతా కలిసి గోపాల్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో తీవ్ర గాయాలు పాలవడంతో గోపాల్ మృతి చెందాడు. బాలికను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేయడం జరిగింది.


ఈ సంఘటనపై కుక్క యజమాని అయిన వినోద్ మాట్లాడుతూ... గ్రామస్తులు కావాలని అతనిని చంపలేదు దాడిలో తీవ్ర గాయాలు పాలవడంతో గోపాల్ మృతిచెందాడు అని తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఘటనపై పోలీస్ అధికారులు రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక కేసు భాగంగా తుపాకీ కాల్పులు జరిపినందుకు, గోపాల్ పై మరోవైపు గ్రామస్తులంతా కలిసి గోపాల్ పై దాడి చేసి కొట్టి చంపిన అందుకు కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: