ఇది వరకు రోజులలో కేవలం మగవారు ఎక్కువ ఉద్యోగాలు చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో అందరూ సమానమే అంటూ ఆడ, మగా తేడా లేకుండా అందరూ పొద్దున లేస్తే సరి ఆఫీసులకు పరుగులు పెట్టే వారు అయిపోయారు. ఇంతకు ముందు రోజుల్లో మగవాడు ఉదయం ఆఫీసుకు వెళ్ళి పని చేసుకునే వచ్చేసరికి భార్య అన్నీ సిద్ధం చేసి భోజనం తయారు చేస్తూ ఉండేది. అలాగే భర్త కోసం ముస్తాబై భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవు.


ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి పని ఒత్తిడి వారిది. ఇక అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పది నిమిషాలు మాట్లాడడానికి  కూడా దంపతులకు సమయం దొరకడం లేదంటే నమ్మండి. అలాంటిది కేవలం మాట్లాడుకోవడానికి సమయం దొరికనప్పుడు వాళ్లు కాపురం ఎలా చేస్తారు..? నిజానికి భోంచేసిన తర్వాత పడుకునే ముందు చాలా సమయం దొరుకుతుంది అని అనుకోవచ్చు. ఇకపోతే అలాంటి సమయంలో కూడా ఉద్యోగ విషయాలు, ఇతర సమస్యలు, ఇతర వాటి గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇలా మాట్లాడటం వల్ల మగవారికి ఉన్న కాసింత మూడ్ కూడా టోటల్ గా వారి శృంగార జీవితానికి దూరం అయిపోతున్నారు.


అయితే ఈ విషయంపై కొందరు మానసిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. నిజానికి భార్యభర్తలిద్దరు వారి పడక గదిలో ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అని టాపిక్ ని తెలియజేస్తున్నారు. నిజంగా శృంగారం సమయంలో ఏ టాపిక్ కి దూరంగా ఉండాలి అనే వాటిపై మీరు కూడా ఒక ఆలోచన తెచ్చుకోండి. నిజానికి చాలా మంది మహిళలు వారి భర్తలను తమ గుపిట్లో ఉంచుకోవడానికి ఒక వీక్ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారట. వారి కోరికలు తీరుస్తే, తన కోరిక తీరుస్తాను బెట్టు చేస్తారట. కాకపోతే అది అప్పటికి వర్కవుట్ అయినా ఆ తర్వాత మాత్రం సమస్యలు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం ఆడవారే కాదు కొందరు మగవారు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా భార్యాభర్తలను శృంగార విషయంలో దూరంగా ఉండేలా చేస్తుంది.


అందులో మొదటిగా చెప్పుకునేది మన నోటి నుంచి వచ్చే దుర్వాసన, చెమట, అపరిశుభ్రత. చాలామందికి సిగరెట్లు తాగడం, గుట్కా తినడం వంటివి తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారు మన పక్క నుంచి వెళితే చాలు, దానితో మనం చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది మన వారు పక్కకు వెళ్తే ఎంత ఇబ్బంది పడుతుందో చెప్పండి...
నిజానికి లైంగిక సంబంధం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉన్నాయి. శృంగార జీవితానికి తొలి శత్రువు వారి ఒత్తిడి అని చెప్పవచ్చు. పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు గడిచినా నిజానికి ఏదో ఒక మూల నుండి వారికి ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు తమ జీవిత భాగస్వామిని నచ్చేలా, మెచ్చేలా వారు వారిని మార్చుకుంటే జీవితం ఆనందంగా ముందుకు సాగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: