అనుకున్నది ఒకటి అయింది ఒకటి అలా ఉంది వీరి పరిస్థితి. వారు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురి కుటుంబం సభ్యులను ఒప్పించి పెళ్లి మాటలు మాట్లాడుకునే ఎందుకు సిద్ధమయ్యారు.

IHG

కానీ ఇంతలో ఏమి జరిగిందో ఏమోకానీ ఇరువురి కుటుంబాల మధ్య గొడవ తలెత్తడంతో వారి వివాహం జరగదనే  అనుమానంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. 

IHG


ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరంలోని సిమెట్రీ పేటకు చెందిన శిరీష ధవలేశ్వరంకి చెందిన రాజు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ తరుణంలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకొని వారి కుటుంబ సభ్యులతో చెప్పి ఎలాగోలా ఒప్పించారు.

IHG's scolding, teen jumps off building

 

ఇక పెళ్లి విషయాలు మాట్లాడుకునేందుకు శిరీష కుటుంబ సభ్యులు రాజు ఇంటికి వెళ్లడం జరిగింది. మాటల సందర్భంలో ఇరువురి కుటుంబాల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది.


ఇక ఈ కుటుంబంలో గొడవ జరుగుతుందని తెలియడంతో పెళ్లి జరగదేమో అన్న మనస్థాపంతో శిరీష చెయ్యి మణికట్టుపై కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ విషయం తెలుసుకున్న రాజు కూడా ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీనితో యువతిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరోవైపు రాజుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: