కొంద‌రి మూర్ఖ‌త్వానికి లాజిక్ ఉండ‌దు. వేలాపాలా లేకుండా...స‌మ‌యం, సందర్భంతో ప‌నిలేకుండా త‌మ మూర్ఖ‌త్వాన్ని చాటుకుంటుటారు. అలా ఓ వ్య‌క్తి త‌న పిచ్చిని ప్ర‌ద‌ర్శించి చూపాడు. ఆప‌ద‌లో ఉన్న స‌మ‌యంలో సహాయం ఆమెనే ఇబ్బందుల పాలు చేశాడు ఓ దుర్మార్గుడు. కోడికూర వండ‌లేద‌నే కోపంతో క్వారెంటైన్‌లో ఉన్న ఓ వ్య‌క్తి ఆశా కార్య‌క‌ర్త‌పై దాడిచేసి చేయి విర‌గ్గొట్టాడు‌.

 

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించ‌డంతో వివిధ రాష్ట్రాల్లో ప‌లువురు చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఇలా మహారాష్ట్రలో చిక్కుకుని ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లోని కలబురగి జిల్లాకు తీసుకువ‌చ్చారు. అలా వచ్చిన వారిని అళంద కిణ్ణి గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రంలో ఉంచారు. వారిలో సోమనాథ సొనకాంబళె అనే వ్యక్తి తనకు చికెన్, చేపల‌ కూరతో భోజనం ఇవ్వాలని, త‌న పిల్ల‌ల‌కు తినేందుకు చిప్స్ ఇవ్వాల‌ని ఆశా కార్యకర్త రేణుకా నాగప్పను కోరాడు. అయితే, రేణుకా నాగ‌ప్ప అందుకు తిర‌స్క‌రించారు. తాము మీరు కోరిన వంట‌లు ఇవ్వ‌లేమ‌ని, ప్ర‌భుత్వ ఉన్నతాధికారుల సూచించిన భోజనాన్నే అందజేస్తామని చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన సోమ‌నాథ సొన‌కాంబ‌ళె ఆశాకార్య‌క‌ర్త రేణుక‌పై దాడిచేశాడు. ఈ దాడిలో రేణుక ఎడ‌మ‌చేయి విరిగిపోయింది. ప్ర‌స్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సోమనాథపై కేసు నమోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 


లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల్ని సొంత ప్రాంతాలకు తరలించే క్రమంలో కేంద్రం వ్యవహరించిన తీరు కారణంగా దేశంలో వలసలపై తీవ్ర ప్రభావం తప్పేట్టులేదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుంది. పారిశ్రామిక, భవన నిర్మాణ రంగాల్లో వలస కూలీల పాత్ర కీలకం. లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవానికి ఇప్పటికే కేంద్రం రెండు భారీ ప్యాకేజీలు ప్రకటించింది. అయితే అంతర్గత వలసదార్లతో పాటు విదేశాల నుంచి తిరిగొస్తున్న వలసదార్ల పునరావాసం పునరేకీకరణకు తగిన పథకాలేవీ ఈ ప్యాకేజీలో లేవు. రాష్ట్రాలు కూడా ఇప్పటివరకు వలసదార్ల తరలింపు పైనే దృష్టిపెట్టాయి తప్ప వారి పునరావాసంపై యోచించడం లేదు. ఈ ప్రభావంతో వలసదార్లు స్వల్పకాలికంగా నష్టపోతారు. అయితే దీర్ఘకాలంలో వారే గెలుస్తారు. వలసదార్లు లేని ముంబై నగరాన్ని ఎవరూ ఊహించలేరు. ఒక్క ముంబయ్యే కాదు.. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు వంటి భారీ నగరాల్లోని ఆర్థిక వ్యవస్థల్లో వలసదార్లు 30 నుంచి 40శాతమున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: