విశాఖపట్టణంలో కరోనా వైరస్ లాక్ డౌన్ సమయములో తెల్లవారుజామున ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువు రిలీజ్ కావడం ఒక రాష్ట్రాన్ని కాదు దేశం మొత్తాన్ని ఆందోళనకు గురి చేసింది. వేకువ జామున నిద్ర మత్తులో ప్రజలంతా ఉన్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో కంపెనీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్ల లోపు స్థైరిన్ గ్యాస్ వ్యాపించడంతో చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. ఏం జరుగుతుందో అనే తెలిసే లోపే కొన్ని వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 12మంది చనిపోగా కొన్ని వందలాది మంది ఆసుపత్రి పాలవడం మనకందరికీ తెలిసిందే. వెంటనే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టి క్షతగాత్రులకు చనిపోయినవారికి నష్ట పరిహారం భారీ స్థాయిలో ఇవ్వటంతో చాలా వరకు ఈ విషయం సైలెంట్ అయిపోయింది.

 

ఇటువంటి సమయంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో జగన్ సర్కార్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు ప్రకటించింది. కంపెనీని సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కంపెనీలో ఎవరిని అనుమతించడానికి వీలు లేదని తెలిపింది. ఇదే సమయంలో కంపెనీకి సంబంధించి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్ళి పోవడానికి వీలు లేదు అని ఆదేశాలు జారీ చేసింది.

 

ఇదే సమయంలో కంపెనీ డైరెక్టర్లు తమ పాస్ పోర్ట్ లని స్వాధీన పరచాలి అని తెలిపింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయ స్థానం లిఖిత పూర్వకంగా ఆదేశాలను జారీ చేసింది. గ్యాస్ లీకేజ్ ఘటన తర్వాత స్థైరిన్ గ్యాస్ ఎవరి అనుమతితో విదేశాలకు తరలించారని అన్న విషయాల గురించి పూర్తిగా అఫిడవిట్ లో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: