ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం మరీ ఎక్కువైపోయిందన్న  విషయం తెలిసిందే. సోషల్ మీడియా లేనిది ఏ పని జరగడం లేదు. ఒకప్పుడు జరిగిన విషయాలు తెలుసుకోవాలంటే మీడియా ద్వారా తెలుసుకునే వాళ్ళు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో ఎక్కడో జరిగిన విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. కేవలం సోషల్ మీడియా ద్వారా అనర్ధాలు జరగడమే కాదు ఎన్నో మంచి పనులు కూడా జరుగుతున్నాయి . ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. 

 

 తాజాగా ఇక్కడ ఒక వ్యాపారికి సోషల్ మీడియా ఎంతగానో కలిసొచ్చింది. సోషల్ మీడియా ఆ వ్యాపారికి వచ్చిన  నష్టాన్ని భర్తీ చేయడమే కాదు ఆ సొమ్మును ఏకంగా పదింతల కంటే ఎక్కువ సొమ్ము  వచ్చేలా చేసింది. దీంతో ఆ వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .ఇంతకీ ఏం జరిగింది జరిగింది అంటారా... ఇక్కడ ఒక వ్యాపారి వేగంగా 30000 నష్టపోయాడు. ఇక తాను ఈ  విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పగా ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయి. 

 

ఢిల్లీలో ఇటీవల ఓ మామిడి పళ్ళ  వ్యాపారికి చెందిన మామిడిపళ్ళు  భారీ మొత్తంలో లూటీ అయ్యాయి. పక్కనున్న వ్యాపారితో  మామిడి పండ్ల వ్యాపారి గొడవ పడుతున్న సమయంలో.. అక్కడే ఉన్న జనం  ఇదే అదునుగా భావించి అక్కడ ఉన్న  మామిడి పండ్లు  భారీ మొత్తంలో లూటీ చేశారు. అందినకాడికి దోచుకు  పోయారు. దీంతో మామిడి పళ్ళు  పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఏకంగా 30 వేల రూపాయల మామిడి పళ్ళు నష్టపోయాడు ఆ వ్యాపారి . ఇక ఈ విషయాన్ని సదరు వ్యాపారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో చాలామంది ముందుకు వచ్చి  నష్టపోయిన ఆ వ్యాపారికి సోషల్ మీడియా వేదికగా విరాళాలు పంపించగా ఏకంగా 8 లక్షల విరాళాలు వచ్చాయి, దీంతో ఆ వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి  తనకు సహాయం చేసిన ఎంతో మందికి ధన్యవాదాలు తెలిపారు ఆ వ్యాపారి.

మరింత సమాచారం తెలుసుకోండి: