టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలలో ఆరితేరిన వారు. యుక్తవయసు నుండి రాజకీయాలను అలవోకగా ఒంటికి పట్టించుకుని తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాణిక్యుడి గా ఎదిగారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న దేశం లో సీనియర్ రాజకీయ నేతగా పేరు సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాజకీయాలు చేయాలంటే డైలమాలో పడిపోయినట్లు సమాచారం. కారణం చూస్తే కరోనా వైరస్ అని టాక్ వినబడుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వృద్ధులపై చూపటంతో చంద్రబాబు ఈ టైం లో పాలిటిక్స్ అవసరమా..? అన్న డైలమాలో ఉన్నారట.

 

చంద్రబాబు వయసు 71 కావటంతో రాజకీయాలంటే కచ్చితంగా నలుగురితో, గుంపులు గుంపులుగా సమావేశమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు కరోనా వైరస్ ప్రభావానికి రాజకీయాలు చేయాలంటే భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైద్యులు కూడా ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం వృద్ధులపై చూపుతుందని ముందునుంచి చెబుతూనే ఉన్నారు. పైగా చంద్రబాబు చుట్టూ ఉండేది దాదాపు అరవై ఏళ్ల సంవత్సరాలకు పైబడిన వాళ్లే. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని పార్టీలో టాక్.

 

ఆయనకి బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అని నాయకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఇంటిపట్టున ఉండి రాజకీయాలు చేసే అవకాశం లేదు. ప్రతి రోజు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో భేటీ అవ్వాలి. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఇటువంటి పనులు చంద్రబాబు చేయటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపటం లేదని పార్టీలో టాక్. ఇప్పుడే కాదు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నుండి చంద్రబాబు చాలా చురుకుగా ఏదైనా కార్యక్రమం గాని ధర్నా గాని చేసిన దాఖలాలు లేవు. దీంతో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పూర్తిగా రాజకీయాలు చెయ్యాలా వద్దా అన్న డైలమాలో చంద్రబాబు ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: