భారతదేశంలోనే ధనిక ఆలయ బోర్డు అయిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారికి సంబంధించిన ఆస్తులను వేలం వేయదలచిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో తమిళనాడులో ఎటువంటి ఉపయోగంలేని సదావర్తి భూములు అంటే తెగ గొడవ చేసిన వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీ వారి ఆస్తులను అమ్మటానికి సిద్ధం అయింది. ప్రస్తుతం తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయంతో అందరూ అవాక్కయ్యారు. విరాళం ఇచ్చిన వాటిలో కొన్నింటిని టిటిడి నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉన్న వ్యవసాయ స్థలాలు కూడా ఇందులో ఉన్నాయి. దాదాపు ఇరవై ఐదు ప్రాంతాల్లో ఉన్న వస్తువులను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది.

 

ప్రస్తుతానికి కారణం అయితే ఆస్తుల నిర్వహణలో తమకు భారంగా మారింది అని.... అందుకే నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి యాజమాన్యం వెల్లడించింది చిన్న చిన్న స్థలాలు కష్టంగా మారిందని వారు చెప్పడం గమనార్హం. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. వైపు ఇది నడుస్తుండగా, మరో వైపు టీటీడీ కూడా ఇదే పద్దతికి శ్రీకారం చుట్టింది. టిటిడి ఆస్తులను అమ్మడానికి ఏప్రిల్ 30 నుంచే ప్రొసీడింగ్స్ కూడా మొదలు పెట్టింది.

 

దాతలు ఇచ్చిన స్థలాలను బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తుల విక్రయానికి పచ్చ జెండా ఊపేశారు. వేలం ద్వారా దాదాపు వంద కోట్లకు పైగా సమకూరే అవకాశం ఉంది. అయితే దాతలు ఇచ్చిన ఆస్తులను టిటిడి వేలం వేయాలని భావించడంపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇదిలా ఉండగా కొన్ని టివి ఛాన‌ళ్ళ‌లో విష‌యానికి సంబంధించి అవాస్త‌వ స‌మాచారంతో భ‌క్తుల్లో గంద‌ర‌గోళం ఏర్ప‌డిందని తెలిపారు. వాస్తవాలు ఇవే అంటూ ఆయన కొన్ని వివరాలను తెలియజేశారు. జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), (09 - 04 - 1990) రూల్ -165, చాప్ట‌ర్ - 22, ద్వారా టీటీడీకి మేలు క‌లిగే అవ‌కాశం ఉంటే దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం, లీజుకు ఇవ్వ‌డం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

 

అసలు ఎక్కడో దూరంగా తమిళనాడులో ఖాళీ స్థలాలు మరియు భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయోతెలియదు. అసలు ఇన్నాళ్ళు ఏమాత్రం టిటిడి కి సంబంధం లేకుండా పడి ఉన్న భూములు వారి పేరిట మిగలడమే గొప్ప. వాటిని అమ్మేసి ఏమీ ప్రభుత్వం తమ ఖజానాలోవేసుకోవడం లేదు కదా.... టిటిడి కార్పస్ ఫండ్ కే చివరికి వాటిని జమచేస్తారు. దానిని టిటిడి అభివృద్ధికి సమర్పిస్తారు.మరి వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: