ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శాంపిల్స్ టెస్టులు కూడా పెరిగాయి.  నెల కిందట 1000 మందిలో 10 మందికి కరోనా ఉన్నట్లు టెస్టుల్లో తేలేది. లెక్కన 11 వేల మందికి టెస్టులు చేస్తే... 110 మంది దాకా తేలాలి. కానీ... 66 మందే తేలారంటే... కరోనా తగ్గుతున్నట్లే అనుకోవచ్చు. తాజాగా 29 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

 

ఇకపోతే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కు చేరింది. నమోదైన మొత్తం కేసులలో చికిత్స అనంతరం కరోనా బారి నుంచి 1807 మంది కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, 56 మంది మరణించారు

 

ఇకపోతే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 41 మందికి వైరస్ సోకగా, మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 53కి పెరిగింది. ఇక, కొత్తగా వైరస్ బారిన పడిన 41 మందిలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధికి చెందిన వ్యక్తులు కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఒకరున్నారు. 11 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది.

 

ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1854కు చేరింది. రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 53కు చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో కోలుకున్న వారు రాష్ట్రంలో 1092 మంది అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారుఇదిలా ఉండగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలతో పోల్చితే... మన తెలుగు రాష్ట్రాలు చాలా మేలు అనుకోవచ్చు. ఏపీకి తమిళనాడు కోయంబేడు మార్కెట్ లింకులు లేకపోయి ఉంటే... మరిన్ని తక్కువ కేసులే వచ్చేవి. తాజాగా చిత్తూరులో 3, నెల్లూరులో 8 తమిళనాడు కోయంబేడుకి లింక్ ఉన్నట్లు తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: