టీటీడీ తమిళనాడులో ఉన్న తన నిరర్థక స్థిరాస్తులను అమ్మేయాలనుకుంది. ఇందుకు వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈరోజు ఆస్తులు అమ్మారు.. రేపు ఏకంగా శ్రీవారిని అమ్మేస్తారేమో అంటూ విమర్శలు చేస్తున్నారు. మీడియా ప్రచారం ప్రభావంతో జనం కూడా శ్రీవారి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారేమో అన్నంతగా భావిస్తున్నారు. అయితే అసలు శ్రీవారి స్థిరాస్తుల అమ్మకం ఇప్పుడే మొదలు కాదట.

 

 

ఇప్పుడు ఇంతగా రచ్చ చేస్తున్న చంద్రబాబు హాయాంలోనే ఈ అమ్మకం మొదలైందట. చంద్రబాబు కాలంలోనూ 100 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మారట. ఈ విషయాలను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటపెట్టారు. ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 100 ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులు విక్రయించారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బయటపెట్టారు. రూ.6కోట్ల విలువైన ఆస్తులను చంద్రబాబు హయాంలో వేలం వేశారని చెవిరెడ్డి గుర్తు చేశారు.

 

 

చంద్రబాబు కాలంలోనే.. అప్పటి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆస్తుల అమ్మకంపై నిర్ణయం జరిగిందట. ఆ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి ముఖ్య సభ్యుడుగా ఉన్నారట. ఈనాడు స్థంస్థల అధినేత రామోజీరావు బంధువు సుచరిత కూడా బోర్డు సభ్యురాలేనట. టీడీపీ ఎమ్మెల్యే కూడా అప్పటి కమిటీలో సభ్యుడుగా ఉన్నారని గుర్తు చేశారు చెవిరెడ్డి. వాళ్లందరూ ఆమోదించిన తర్వాతే ఈ ఆస్తులు వేలానికి వచ్చాయట.

 

 

ఆ తర్వాత 2015 జులైలో నిరర్థక ఆస్తుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేశారట. 2016 జనవరిలో కమిటీ నివేదిక మేరకు ఆస్తుల విక్రయానికి బోర్డు అంగీకరించిందట. అంతే కాదు.. చెవిరెడ్డి మరికొన్ని విమర్శలు చేశారు. వేల కోట్ల విలువైన సదావర్తి భూములను 50 కోట్లకు అమ్మాలనుకుంది చంద్రబాబు కాదా? మానస ట్రస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. మరి టీడీపీ నేతలు ఏం చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: