ప్రపంచం అంతా కరోనాతో బాధపడుతుంటే, కామాంధులు కామంతో చచ్చిపోతున్నారు.. ఆడవారు కనిపిస్తే చాలు, ఏ మాత్రం అవకాశం దొరికినా చాలు వారిలో ఉండే మృగాన్ని బయటకు తీస్తున్నారు.. ఒక తాగుబోతు, నేరస్దుడు, చివరికి బాధ్యతగల వృత్తిలో ఉన్నవారు కూడా, వీరంతా తమలో ఉన్న నీచ కోరికలకు బానిసగా మారి ఆడవారిపై వేధింపులకు పాల్పడుతున్నారు.. ఇక ఇప్పటికే ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న గౌరవం అంతంతా మాత్రమే.. పై అధికారులు మాత్రం ప్రజలతో బాధ్యతగా మసలుకొమ్మని చెబుతుండగా కొందరు మాత్రం పూర్తిగా వారి స్దాయిని మరచి కౄరంగా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి వారి వల్ల మొత్తం వ్యవస్దకే చెడ్దపేరు వస్తుంది..

 

 

ఇకపోతే ఒక హోంగార్డు, ఓ వైద్యురాలి పట్ల ప్రవర్తించిన తీరు మరీ దారుణం.. అతని చెళ్లినో, తల్లినో, అక్కనో వేరే వారు ఇలా చేస్తే ఊరుకుంటాడా.. బొక్కలు ఇరగ్గొట్టడు.. తన వారు మాత్రం ఆడవారు, మిగతా వారు కాదా.. బాధ ఎవరికైనా ఒకటే.. మనిషిగా పుట్టినందుకు కొంతైనా వివేకం ఉండాలంటారు.. నేటికాలంలో ఇది లోపిస్తుంది.. ఇకపోతే సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఓ వైద్యురాలు వారం క్రితం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ముషీరాబాద్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ హోంగార్డుగా ఉన్న వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆ వైద్యురాలి ఇల్లు, ఇతర వివరాలతో పాటుగా తన ఫోన్‌ నంబర్‌ను కూడా తీసుకున్నాడు. ఇక ఆరోజు నుంచి ఆమె సెల్ ఫోనుకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడమే కాకుండా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడట..

 

 

అతని ఆగడాలు శృతిమించడంతో వీటిని భరించలేని సదరు వైద్యురాలు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారట.. దీంతో వెంటనే స్పందించిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అతన్ని సస్పెండ్‌ చేశారు. పౌరుల రక్షణతోపాటు వారితో గౌరవంగా ప్రవర్తించడం పోలీసుల బాధ్యతని స్పష్టం చేశారు. ఇక ఇలాంటి కామాంధులను సస్పెండ్ చేస్తే మారరు అందుకే తగిన విధంగా, మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్పాలని నెటిజన్స్ కోరుకుంటున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: