తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఏపీలో కోయంబేడు లింకులు టెన్షన్ పెడుతుండగా., తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లోనే అత్యధిక కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరోవైపు కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ రికార్డు సృష్టిస్తుంది.


 
ఏపీ, తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.., కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి వైరస్ సోకగా, మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 53కి పెరిగింది. ఇక, కొత్తగా వైరస్ బారిన పడిన 41 మందిలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనివారే. రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదైంది. 11 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త కేసులతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 18 వందల 54కి పెరిగింది.  24 మంది డిశ్చార్జి అయ్యారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 709 మంది చికిత్స పొందుతున్నారు.

 

అటు ఏపీలోనూ కరోనా పంజా విసురుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు ఆదివారం పెరిగాయి. కొత్తగా నమోదైన 66 కరోనా కేసుల్లో 8 కోయంబేడుకు సంబంధించినవే ఉన్నాయి. అలాగే కరోనా వల్ల ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మరణించారు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2 వేల 627కు చేరాయి.  రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 600పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

 

మరోవైపు కరోనా టెస్టుల్లో ఏపీ మరో రికార్డ్‌ను సాధించింది. ఏపీలో కరోనా పరీక్షలు 3 లక్షల మైలు రాయిని దాటినట్లు వైద్య ఆరోగ్యశాఖ  తెలిపింది. కరోనా పరీక్షలు ఇప్పటి వరకు 3 లక్షల 4 వేల 326 కరోనా టెస్టులు చేసినట్లు చెప్పారు. 10 లక్షల జనాభాకు 5 వేల 699 కరోనా పరీక్షలు చేయడంతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీ నిలిచిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: