గత మూడు రోజుల నుంచి ఏపీలో టీటీడీ ఆస్తుల వేలం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీటీడీ ఆస్తుల గురించి టీడీపీ విమర్శలు చేసింది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా టీటీడీ ఆస్తుల వేలం గురించి కొన్ని ప్రశ్నలు సంధించారు. పవన్ తన పోస్టులో టీటీడీ నియమ నిబంధనల ప్రకారం కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆస్తులను అమ్మడం లేదా తనఖా పెట్టడం వీలవుతుందని పేర్కొన్నారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానంకు అవసరం మరియు ప్రయోజనకరం ఐతే మాత్రమే ఆస్తులు అమ్మాలని... సహేతుకమైన కారణాలు ఉంటే ఆస్తుల అమ్మకం చేపట్టాలని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం, టీటీడీ తమిళనాడులో 25 ప్రాంతాల్లో ఆస్తులను ఎలా విక్రయించాలనుకుంటుందో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం తాను సంధించే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. 
 
టీటీడీకి ప్రస్తుతం భూమిని విక్రయించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది...? 
 
టీటీడీ లీజుకు ఇవ్వడం లేదా కమర్షియల్ గా అభివృద్ధి చేసి రెవిన్యూ జనరేట్ చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపించడం లేదు. 
 
టీటీడీ దగ్గర భూములు విక్రయించడానికి సరైన వివరణ ఉందా...? 
 
టీటీడీ విలువల ప్రకారం భూములు అమ్మడం సరైన చర్యేనా...? 
 
లక్షల సంఖ్యలో భక్తుల నుంచి టీటీడీకి ఆదాయం సమకూరుతోందని అందువల్ల వారికి భూములు విక్రయించడానికి గల కారణాలను చెప్పాల్సిన బాధ్యత టీటీడీ, ప్రభుత్వంపై ఉందని తెలిపారు. టీటీడీ ఆస్తుల విక్రయానికి గతంలో అనుమతులు పొందిందా,...? లేదా....? చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు ప్రభుత్వం, టీటీడీ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: