ప్రస్తుతం ప్రజలందరిలో కరుణ వైరస్ భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతకమైన మహమ్మారి దాడి చేసి ప్రాణాలను హరించుకు పోతుందో  అని ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక సమీపంలో ఉన్న వారికి ఎవరైనా కరోనా  వైరస్ లక్షణాలు ఉన్నాయి అంటే ఆమడ దూరం పరుగెడుతున్నారు . ఇక కరోనా  వైరస్ ఉంది అని నిర్ధారణ అయిన వారి దగ్గర అయితే కనీసం కిలోమీటర్ల దూరం  ఉంటున్నారు. ఎందుకంటే ఈ మహమ్మారి వైరస్ ఎక్కడ దాడి చేసి ప్రాణాలు హరించుకుపోతుందో  అని భయం. అయితే కరోనా  వైరస్ పేషెంట్ నుంచి కరోనా సోకదు అంటే ఎవరైనా నమ్ముతారా.

 

 కానీ ఇక్కడ శాస్త్రవేత్తలు ఇదే నిజం అని కనుగొన్నారు... కరోనా వైరస్ సోకిన రోగి పన్నెండు రోజులు దాటినప్పటికీ ఇంకా పాజిటివ్ గా ఉంటే ఆ వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కరోనా  వైరస్ సోకే అవకాశం లేదు అంటూ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. సింగపూర్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజెస్, అకాడమీ ఆఫ్ మెడిసిన్ ల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది... అయితే ఎన్ని రోజుల వరకు ఈ మహమ్మారి వైరస్ సోకిన వారి నుంచి వైరస్ తగ్గేంతవరకు వేరొకరికి  వ్యాపిస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే కరోనా  రోగులు తమ లక్షణాలు కనిపించడానికి రెండు రోజుల ముందు ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తారు అంటూ తాజాగా పరిశోధకులు వెల్లడించారు. 

 


 తాజాగా సింగపూర్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ లో సుమారు 73 మంది కరోనా  పేషెంట్లు పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు వారు తెలిపారు. కరోనా  వైరస్ లక్షణాలు కనిపించిన వారం తర్వాత కరోనా  రోగుల్లో  క్రియాశీల వైరల్ రిప్లికేషన్ తగ్గడం  ప్రారంభమవుతుందని తెలిపిన శాస్త్రవేత్తలు.. తాజా అధ్యయనంలో లభించిన సమాచారం ఆధారంగా చూస్తే... కరోనా  వైరస్ రోగులను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలన్నది ఆసుపత్రి వైద్యులు నిర్ణయించగలుగుతారు అంటూ తెలిపారు . అయితే ప్రస్తుతం చాలా దేశాలలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత రెండుసార్లు నెగటివ్ వస్తే నే పూర్తిగా ఆ వ్యక్తి కరోనా  వైరస్ నుంచి కోలుకున్నాడని   భావిస్తున్నారని... కానీ తాజాగా సింగపూర్ లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన విషయాలు వైద్యులకు  ఎంతగానో ఉపయోగపడతాయి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: