ముస్లిం సోదరులందరూ కి అతి పెద్ద పండుగ రంజాన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటారు ముస్లిం సోదరులు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ముస్లిం సోదరులు ఉండే హైదరాబాద్ ప్రాంతంలో అయితే రంజాన్ వేడుకలు అంబరాన్నంటేల  జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా ముస్లిం సోదరులు దర్శనమిస్తూ వుంటారు. అలై  బలై  తీసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. ఇలా ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా తమ రంజాన్ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది కొకసారి వచ్చే  ఈ రంజాన్ పండుగకు నెలరోజులు ముందు నుండే  నిష్ఠతో ఉపవాసాలు ఉండి అల్లా ను  శుద్ధితో ప్రార్థిస్తూ ఉంటారు. 

 

 అయితే రంజాన్ పండుగ వచ్చింది అంటే హైదరాబాద్ లో సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న మక్కామసీదు వద్ద అయితే ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మక్కామసీదు కు చేరుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముస్లిం సోదరులు ఆరాధించే అల్లా సమక్షంలో ఉపవాస దీక్షలు వదులుతూ ఉంటారు ముస్లిం సోదరులు. ఇక అందరూ ముస్లింలు ఒకేచోట చేరి అలై  బలై  తీసుకుంటూ ఒకరికొకరు  శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అయితే ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ అతి పెద్ద పండుగ కాబట్టి... ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు ముస్లిం సోదరులు

 


 కానీ ప్రస్తుతం ముస్లిం సోదరులకు అలాంటి అవకాశం లేకుండా పోయింది... రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు ఎంతో సందడిగా గడిపే ముస్లిం సోదరులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. కరోనా  వైరస్ పుణ్యమా అని రంజాన్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే భాగ్యనగరంలో ప్రస్తుతం ఎలాంటి హంగులు లేవు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం రంజాన్ వేళ బోసిపోయింది.  ముస్లిం సోదరులు మసీదులకు వెళ్ళలేక... కనీసం రంజాన్ శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 112 ఏళ్ల క్రితం వచ్చింది. 112 ఏళ్ల క్రితం మూసి వరదలు రావడంతో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ళకి కరోనా వైరస్ ప్రభావం కారణంగా ముస్లిం సోదరులు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కనీసం మసీదులకు కూడా వెళ్లకుండా రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: