ఆంధ్ర రాజకీయాల్లో డాక్టర్ సుధాకర్ అంశం రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెల్సిందే. డాక్టర్ సుధాకర్ అంశంలో అటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ కి టిడిపి పార్టీ మద్దతుగా నిలుస్తూ సమర్థిస్తూ అంటే.. మరోవైపు వైసిపి మాత్రం టిడిపి పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. అయితే ఆసుపత్రిలో పీపీఈ  కిట్లు మాస్కుల కొరత ఉందని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు  ఇంత దారుణానికి ఒడిగడతారా  అంటూ ప్రతిపక్ష టిడిపి పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇక పోలీసులు డాక్టర్ సుధాకర్ పట్ల దురుసుగా ప్రవర్తించటం  ఆంధ్ర రాజకీయాల్లో  సంచలనంగా మారిపోయింది. 

 


 అయితే డాక్టర్ సుధాకర్ ఒక మానసిక రోగి అని... అతని మానసిక స్థితి సరిగా లేకపోవడం కారణంగానే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్  ఆరోపించింది. దీనిని  తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దీనిపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో  టీడీపీ నేతలు మరింత ఎక్కువగా అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ సీనియర్ నేత అయిన వర్ల రామయ్య సుధాకర్ అంశానికి సంబంధించి అధికార పార్టీపై విమర్శలు  చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు... ఒక్క మాస్క్ తో పోయేదాన్ని ఏకంగా సిబిఐ వరకు తెచ్చిన మీ సలహాదారు గొప్పతనాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అంటూ వ్యాఖ్యానించారు టిడిపి నేత వర్ల రామయ్య. కోట్లాది రూపాయల జీతం పొందుతూ మీకు ప్రభుత్వానికి వారు అందిస్తున్న సేవలకు ఇవే  మా జోహార్లు అంటూ ఎద్దేవా చేశారు వర్ల  రామయ్య. ఇంతటి ఘనపాటి ల సేవలను ప్రభుత్వం భవిష్యత్తులో భరించలేదు అని వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. కాగా ప్రస్తుతం వర్ల రామయ్య పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: