చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో సీఎం రమేష్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలను సీఎం రమేష్ దగ్గరుండి చూసుకునేవారు. రాజ్యసభ సభ్యుడిగా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్... చంద్రబాబు హయాంలో కడప కు సంబంధించి ప్రతీ కార్యక్రమంలో తన ప్రోద్బలం ఎక్కువగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే సమయంలో సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ కచ్చితంగా తీసుకు వస్తాను మోడీ మెడ వంచుతాను అని పది రోజుల పాటు నాటకీయ పరిణామాల దీక్ష రమేష్ చేయడం జరిగింది. ఈ దీక్షకి ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు అప్పట్లో  భయంకరమైన హడావిడి చేశారు. కానీ పెద్దగా పని జరగలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది.

 

కడప జిల్లాలో అయితే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో రమేష్ బాబు ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే వెంటనే టీడీపీ కి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు కనబడిన రమేష్ బాబు తాజాగా మళ్లీ దర్శనమిచ్చారు. సొంత నియోజకవర్గం ఏపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని సొంత గ్రామం పోట్లదుర్తి లో దీక్షకు రెడీ అయ్యారు. ప్రభుత్వ భూముల విక్రయ జీవోను కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రమేష్ కీలక విషయాలపై దీక్షకు కూర్చో బోతున్నారు.

 

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో జగన్ సర్కారు చిత్తశుద్ధితో పని చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సలహాదారు లకు 30 మందికి పూర్తి వేతనాలు అందిస్తుంటే ప్రభుత్వ అధికారులకు మరియు పెన్షనర్లకు సగం వేతనాలు ఇవ్వటాన్ని సీఎం రమేష్ తప్పుబట్టారు. మొత్తం మీద రమేష్ కి కలిసివచ్చే దీక్ష ఫార్ములాతో తన ఉనికి చాటుకోవడానికి ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్ అయినా విషయాలను టార్గెట్ చేసి సరికొత్త ట్రెండ్ సొంత గ్రామం వేదికగా సృష్టించడానికి అడుగులు వేస్తున్నారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: