టిక్ టాక్, పబ్ జి ఇలా కొన్ని మొబైల్ అప్లికేషన్స్ కొంత మంది ప్రాణాలు తీసుకోవడమే లేదా వేరే వారి ప్రాణాలు తీసేంతవరకు జరుగుతోంది. ఇప్పటివరకు పబ్ జి ఆట వల్ల ఎంత మంది ప్రాణాలు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక ఎవరుకి వారి టాలెంట్ ని బయట పెట్టేందుకు ఉపయోగించే టిక్ టాక్ యాప్ కూడా అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణం అయింది. అయితే ఇక అసలు విషయంలోకి వెళితే...  


తన ఇంటి ముందు రాత్రి వేళ కొంతమంది యువకులు టిక్ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటే అక్కడ తీయవద్దని వారిని నివారించేందుకు ప్రయత్నించగా ఆ యువకుడి పై, అతడి తల్లి పైన దాడి జరిగిన సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవ్వడం జరిగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్. 10 లో సింగాడ బస్తీలోని ధోబీఘాట్‌ లో నివసిస్తున్న సురేష్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇకపోతే శనివారం రాత్రి 9 గంటల సమయంలో సుమారు 15 మంది యువకులు అతని ఇంటి ముందర టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. ఈ విషయంపై సురేష్ తన ఇంటి ముందర అలాంటివి చేయవద్దని వారిని హెచ్చరించారు.


దీనితో కోపోద్రిక్తులైన ఆ యువకులు అతడిని అక్కడ ఉన్న సురేష్, అతడి తల్లి ఇద్దరి పైకి వారు దాడికి పాల్పడ్డారు. ఇక వారు వెళ్ళిన తర్వాత బాధితుడు సురేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ యువకులతో భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న నేపథ్యంలోనే నేను వారిని హెచ్చరించానని, అందుకు వారు నా పైన, నా తల్లి పైన దాడి చేశారని సురేష్ ఫిర్యాదులో పోలీసులకు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: