చంద్రబాబు 65 రోజుల తరువాత ఉండవల్లిలోని తన నివాసానికి చేఅరుకున్నారు. 65 రోజులు సుదీర్ఘమైన కాలం. నిజానికి ఇంత సమయం ఎపుడూ బాబు పార్టీకి, ప్రజలకు దూరంగా గడిపింది లేదు. నిజంగా బాబు మొత్తం నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇదొక రికార్డుగా చెప్పుకోవాలి.

 

ఇక ఏపీ రాజకీయాలు ఇంతవరకూ ఒక లెక్కన సాగాయి. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండే మొత్తం రాజకీయాన్ని నడిపారు. బాబు ఏపీలో లేరన్న మాటే కానీ ఆయన మీడియాలో లేని రోజు  ఎక్కడా లేదు.  ఆయన ఎక్కడ ఉన్నా వైసీపీని టార్గెట్ గా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఓవైపు కరోనా మహమ్మారి వీర విహారం చేస్తున్నా కూడా ఎన్నో రాజకీయాలు జరిగిపోయాయి.

 

ఇంకో వైపు ఏపీ సర్కార్ కి అడుగడుగునా బ్రేకులు వేయడంలో బాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. ఈ టైంలోనే మత్తు డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ సాగింది. అది వైసీపీ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కోర్టు దాకా వెళ్ళిన ఈ వ్యవహరంలో  సీబీఐ విచారణకు కూడా కోర్టు ఆదేశించాల్సివచ్చింది. ఇది వైసీపీ సర్కర్ కి పెద్ద షాక్ గానే చూడాలి.

 

ఇక ఏపీలో రాష్ట్ర  ఎన్నికల అధికారి  నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఎపిసోడ్ లో కూడా ఏపీ  రాజకీయాలు రంజుగా సాగాయి. నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసి తన తొలగింపు అన్యాయమని చెప్పుకొచ్చారు. ఆయనకు మద్దతుగా కూడా టీడీపీ నిలబడింది. రాజకీయం కూడా ఆ విధంగా సాగి సర్కార్ని మళ్ళీ ఇరుకున పెట్టింది.

 

ఇక బాబు అమరావతిలో ఎంటర్ అవుతారగానే టీటీడీ భూముల వేలం కధ సాగుతోంది. దాన్ని కూడా తనదైన శైలో మలుపులు తిప్పుతూ హిందూ కార్డుతో టీడీపీ ఓ రేంజి పాలిటిక్స్ చేస్తోంది. గత మూడు రోజులుగా సాగుతున్న‌ ఈ వ్యవహరం  వైసీపీ సర్కార్ కి కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. 

 

మొత్తం మీద చూసుకుంటే బాబు రెండు నెలలుగా ఏపీలో లేరు అనే మాటే కానీ ఆయన రాజకీయం మాత్రం ఎక్కడా ఆగలేదు. ఈ క్రమంలో  బాబు ఏపీలో ఎంటర్ అయ్యారు. ఆయన ప్రత్యక్ష రాజకీయం ఇపుడు ఏ విధంగా ఉంటుందో ఏపీ రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: