కరోనా ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి లాక్ డౌన్ విధించినప్పుడు ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడేవారు. కుటుంబం నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్లి ఒకేసారి నాలుగు రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకుని ఇంట్లో కాలం గడిపిన రోజులు ఉన్నాయి. అయితే సడలింపులు ఇచ్చిన తర్వాత మాత్రం బయటంతా జనాలు విచ్చలవిడిగా తిరగడం మొదలు పెట్టారు. సామాజిక దూరం అన్న మాట మరచిపోయి షాపింగ్ లంటూ తిరుగుతూ కాలం గడుపుతున్నాడు.

 

అయితే పలు కంటెంట్మెంట్ క్లస్టర్లు మరియు రెడ్ జోన్ లలో ఇప్పటికీ జనం అలాగే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. అలాంటి వారికోసం ఇంటివద్దకే వచ్చి సరుకులను ఇచ్చేందుకు జియో మార్ట్ ఇప్పుడు కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. రంగంలో కార్ట్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ తో పోటీపడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో మార్ట్ ముందు పూణే మరియు ముంబై లో మాత్రమే తన సేవలను ప్రారంభించింది. అయితే కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా 200 పట్టణాలలో జియో మార్ట్ సేవలు వినియోగదారులకు లభిస్తున్నాయి.

 

ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.... ఫేస్ బుక్.... జియో లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. వార్త కొద్దిరోజుల ముందే దేశవ్యాప్తంగా హల్ చల్ చేసింది. ఇప్పుడు దీనివల్ల వాట్సాప్ ద్వారా జియో మార్ట్ సేవలను వినియోగదారులు పొందే అవకాశం లభించింది. వాట్సాప్‌లో వారు త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేస్తే కొన్ని గంట‌ల్లోనే స‌రుకులు ఇంటి వ‌ద్ద‌కే డెలివ‌రీ వ‌స్తాయి. కాగా జియోలో కేవ‌లం ఫేస్‌బుక్ మాత్ర‌మే కాకుండా ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా భారీ ఎత్తున వాటాల‌ను కొనుగోలు చేశాయి. క్ర‌మంలోనే త్వ‌ర‌లో జియో మార్ట్ సేవ‌ల‌ను దేశంలో మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: