ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇండియా దేశంలో రోజురోజుకీ బలోపేతం అవుతుంది. వైరస్ దేశంలోకి వచ్చిన ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికి పరిమితం చేయటం వల్ల చాలా మంచిది అయింది. ఒకవైపు ఈ వైరస్ వల్ల యూరప్ దేశాలలో మరణాలు భయంకరంగా సంభవిస్తుంటే, వైరస్ పుట్టినిల్లు చైనా దేశం పక్కనే ఉన్న ఇండియాలో మాత్రం అతి తక్కువ కేసులు నమోదు కావడం అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ఇండియా దేశం కరోనా వైరస్ తో గట్టిగా పోరాడుతుందని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. 

 

ఇటువంటి సమయంలో ఢిల్లీ మత ప్రార్థనల వేదికగా బయటపడిన పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఒక్కసారిగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించిన విధంగా పెరిగిపోయాయి. ఇదిలావుంటే ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసి సడలింపులు ఇవ్వటంతో ఊహించని విధంగా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పాజిటివ్ కేసులు బయటపడటంతో కేంద్రంలో అలజడి మొదలైంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్ సర్కార్ వైరస్ నియంత్రించడంలో మొదటినుండి చాలా తెలివిగా వ్యవహరిస్తున్న తరుణంలో పాజిటివ్ కేసులు బయటపడుతున్న అవి పరీక్షలలో కావటంతో ఏపీ సర్కార్ చాలా సేఫ్ జోన్ లో ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. 

 

ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కరోనా వైరస్ వైద్య పరీక్షలు ఏపీలో జగన్ సర్కార్ చేయటం పట్ల కేంద్రం అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. టెస్టుల విషయములో మరియు రికవరీ విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే జగన్ సర్కార్ నెంబర్ వన్ స్థానం లో ఉండటంతో కేంద్రం దగ్గర కరోనా వైరస్ కట్టడి చేయడంలో మళ్ళీ ప్రూవ్ చేర్చుకోంది. మొన్నటి వరకూ పాజిటివ్ కేసులు బయట పడిపోతున్నాయని విమర్శలు చేసిన విపక్షాలు కేంద్రం జగన్ ప్రభుత్వం పై అభినందనలు కురిపించడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: