శ్రీవారి భూములని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. భూములు వేలం వేయడం ఆపాలని ప్రతిపక్షాలు, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. బీజేపీ నేతలైతే టీటీడీ భూముల వేలం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ...ఉపవాస దీక్షలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అటు టీడీపీ నేతలైతే ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోతున్నారు.

 

టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దొరికిపోయిన దొంగలు మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా టీడీపీపై నెపం నెడుతున్నారని, గతంలో తాము అనేక నిర్ణయాలపై సబ్‌కమిటీలు వేశామని, గతంలో అమ్మాలని బోర్డు పరంగా నిర్ణయాలు తీసుకోలేదని చెబుతున్నారు. ఇక టీటీడీ వివాదంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా స్పందించి,  ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. టీటీడీ వ్యవహారంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

 

అయితే టీటీడీ భూములని అమ్మాలనే విషయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంగా టీటీడీ భూములని బహిరంగంగా వేలం వేయడానికి సిద్ధమైంది. కాబట్టి దీనిలో అవినీతి జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు. కానీ టీడీపీ మాత్రం దేవుడు సొమ్ము దోచుకోవడానికే జగన్ ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు.

 

అంటే వారి చేసే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అర్ధమవుతుంది. పైగా గత ఐదేళ్లు టీడీపీ హయాంలో అమరావతిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగింది. అదే విషయం సినీ నటుడు మంచి మనోజ్...వైసీపీ ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలలో అర్ధమవుతుంది. ఆయన టీటీడీ భూములని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తూనే, ఇందులో మోసం జరగడం లేదని తెలుసు, బహిరంగ వేలం కాబట్టి ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగే అవకాశం లేదని టీడీపీకి పరోక్షంగా చురకలు అంటించారు.  అయినా సరే దేవుడు భూములని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. దీని బట్టి చూసుకుంటే టీడీపీ కేవలం రాజకీయం చేస్తున్నట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: