ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ముందుకు వస్తున్నారు. అనేక సార్లు  ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నారు. నిజానికి మిగిలిన ప్రధానులకు మోడీ భిన్నం. ఆయన వస్తూనే ఆకాశవాణి, దూరదర్శన్ లను  వేదికలుగా చేసుకుని  బాగా ఉపయోగించుకుంటున్నారు.

 

ప్రతీ నెలా ఠంచనుగా మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నారు. తన మనసులో మాటలను జాతి జనులతో  పంచుకుంటున్నారు. ఇపుడు లాక్ డౌన్ వేళ ఈ రెండు నెలల్లోనే  మరిన్ని సార్లు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇపుడు దేశంలో నాలుగవ విడత లాక్ డౌన్ నడుస్తోంది. అది ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది.

 

సరిగ్గా అదే రోజు ఉదయం ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడబోతున్నారు. ప్రధాని ఏం మాట్లాడుతారు అన్న ఉత్కంఠ ఇపుడు అందరిలో ఉంది. మోడీ ఏం చెబుతారు.లాక్ డౌన్ కొనసాగుతుందా. లేక పూర్తిగా ఎత్తివేస్తారా. లాక్ డౌన్ కాలంలో ఇచ్చిన సడలింపులు అన్నీ ఇప్పటికే ఇచ్చేశారు. ఇక మిగిలిన రంగాలు కొన్ని ఉన్నాయి.వాటి విషయంలోనే నిర్ణయం తీసుకోవాల్సిఉంది.

 

మొత్తం మీద చూసుకుంటే ప్రధాని మోడీ మీడియా ముందుకు వస్తున్నారంటేనే ఒక సంచలనం. ఆయన ఏం చెప్పినా అది విశేషమే. కాబట్టి మోడీ ప్రసంగం కోసం ఆంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి మోడీ ఏం చెబుతారో.

 

ఇదిలా ఉండగా కరోనాతో కలసి జీవించాలని అందరూ చెబుతున్నారు. ప్రజలు కూడా ఆ దిశగా తమ జీవనాన్ని మెల్లగా అలవాటు చేసుకుంటున్నారు. కరోనా ఇప్పట్లో పోదని అలాగని బతుకు బండిని ఆపుకోవడం తెలివైన పని కాదని పెద్దలు చెబుతున్నారు. జనం కూడా దాన్ని గ్రహించి అలాగే అడుగులు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు కూడా మోడీ చెబుతారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: