ఒక పక్క దేశం మొత్తం కరోనా వైరస్ కారణంగా బెంబేలెత్తిపోతుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలో కూడా మన భారత దేశం మీద పాక్  ప్రభుత్వం కక్ష తీర్చుకునే చర్యలకు పాల్పడుతుందంటే ఇంతకన్నా దారుణం ఇంకా ఏముంది చెప్పండి. అవునండీ మీరు విన్నది నిజమే.. ఇప్పుడు భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఓ గూఢచార పావురం చేజిక్కడంతో దేశం మొత్తం బయ బ్రాంతులతో వణికిపోతుంది. అసలు ఈ పావురాన్ని ఎవరు పంపారు.. !!ఎందుకు పంపారు.. !!ఎవర్ని కలిసింది !!మళ్ళీ ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది అనే సందేహంలో ఉండిపోయారు అందరు. అసలు వివరాలలోకి వెళితే అసలు ఈ పావురాన్ని  కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని మన్యారీలోని  గ్రామ ప్రజలు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో హీరానగర్ సెక్టార్ వద్ద ఈ పావురాన్ని గుర్తించారు.

 

దాన్ని పట్టుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్ బోర్డర్ వైపు ఎగురుతూ కిందపడిపోయిందని వారు తెలిపారు. పావురాన్ని క్షుణ్నంగా పరిశీలించగా.. దాని కాలుకి ఓ రింగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పావురం రెక్కపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన నంబర్లు ఉండటంతో అది పాకిస్థాన్ గూఢచారి గాజిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా నిర్ధారించారు. దాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు.అప్పట్లో పావురాలు సందేశాలను జారవేశాయట.. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత పావురాన్ని ఉపయోగించింది పాక్ దేశం..

 

 

కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయాన్ని అదనుగా చూసి కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి పాక్ వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేగాక భారత్‌లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్‌ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పాక్ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

 

 

పాక్ ప్రయత్నాలను ఎండగట్టడానికి భారత్ సిద్ధమైంది. గిల్గిట్ బాల్టిస్థాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని పాక్ రాయబారికి భారత విదేశాంగ శాఖ అందించిన  లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కవ్వింపు చర్యలు సరికావు అని విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారత భూభాగంలోకి పంపించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.. ఈ పావురం రెక్కల మీద ఉన్న కోడ్ దేనికి సంకేతం అని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.అసలే ఒక పక్క కరోనా ఎటు నుంచి వచ్చి అంటుకుంటుందో అన్న భయం తో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మధ్యలో ఈ పావురం గోలేంటో అసలు అర్థంకావడం లేదు... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: