శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎమ్మార్వో తామరపల్లి రామకృష్ణను భయంకరమైన భాషతో బూతులు తిట్టడంతో రవి కుమార్ పై సెక్షన్ 353, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే కూన రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే ఇటీవల రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎమ్మార్వో నీ టిడిపి అధినేత ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించడం జరిగింది.

 

ఈ నెల 16 వ తారీఖున గోరింట గ్రామంలో చెరువు కు సంబంధించి తవ్వకాల విషయంలో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జెసిబి లు, నాలుగు టిప్పర్ లతో మట్టి అక్రమంగా తవ్వుతుండగా వీఆర్వో నుంచి ఫిర్యాదు రావడంతో ఎమ్మార్వో అక్కడకు చేరుకుని కూన రవికుమార్ సోదరుడి వాహనాలను సీజ్ చేశారు. దీంతో టిడిపి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎమ్మార్వో కి ఫోన్ చేసి భయంకరంగా బూతులు తిట్టారు. దానికి సంబంధించిన ఆడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎమ్మార్వో రామకృష్ణ సీరియస్ అయ్యారు.

 

కూన రవికుమార్ కి మొదటి నుండి ప్రభుత్వ అధికారులు అంటే చులకన అంటూ  ఎప్పుడూ ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటారు అని అది ఆయనకు అలవాటు అని చాలా సార్లు నన్ను విమర్శించాడు నరికేస్తా, పాతేస్తానని రవికుమార్ తనను బెదిరించారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వపరంగా విధులు చేస్తున్న సమయంలో ఆయన అనుచరులు కారును వెంబడించి బెదిరింపులకు దిగారని రామకృష్ణ తెలిపారు. దీంతో ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: