గ్రామాల్లో చాలా సార్లు కొన్ని మూఢనమ్మకాలు తెగ ప్రచారం జరుగుతూ  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. గతంలో చాలానే మూఢనమ్మకాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఒక దీపం గాలిలో వచ్చి ఏకంగా ఇళ్లను తగలబడుతోంది అని గతంలో ప్రజలు  భయాందోళనకు గురయ్యారు.. కాగా  పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా వ్యక్తులు కావాలని ఇలా చేస్తున్నారు అని బయట పడింది. ఇదిలా ఉంటే అప్పట్లో  ఒక దెయ్యం ప్రతి ఇంటికి తిరుగుతుందని బయట ఓ స్త్రీ రేపు రా అని రాసి పెడితే ఇంట్లోకి రాదు  ప్రచారం అవ్వగా నిజంగానే ప్రజలు ఇలా చేశారు. ఇదంతా ఆకతాయిల చేస్తున్న పుకార్లు అని  చెప్పినప్పటికీ అటు ప్రజలు మాత్రం కాస్త ఆందోళనకు గురయ్యారు అని చెప్పాలి. 

 


 తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొన్ని సంఘటనలు అక్కడి ప్రజలకు తలనొప్పిగా మారిపోయాయి. ఏకంగా ఇళ్ల  మీద తరచు రాళ్ళు పడుతుండటం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. మొదట ఆకతాయిలు అలా చేస్తున్నారు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రజలకు భయం పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం లోని నాలుగు గ్రామాల్లో.. తానే లంక పంచాయతీ పరిధి లో ఇళ్ల  పైన రాళ్ల దాడి జరుగుతోంది. ఇళ్లపై రాళ్ళు పడుతున్నాయి ఆ తరువాత గంటల వ్యవధిలో మరోసారి రాళ్ళు పడుతున్నాయి. 

 


 ఇక దీనిపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఇది చేశారు అంటూ సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఇక ఆ వ్యక్తిని అరెస్టు చేసినప్పటికీ కూడా అలా గాలిలో నుంచి రాళ్లపడటం  మాత్రం ఆగిపోలేదు. దీంతో ఆయా గ్రామాల్లో అసలు ఏం జరుగుతుంది అన్నటువంటిది ప్రజలు భయాందోళన పట్టుకుంది. మామూలుగానే ఏ చిన్న  విషయం జరిగిన దానికి పెద్దగా చేస్తూ ఉంటారు గ్రామాలలో. ఇక ఇప్పుడు ఇలా ఇళ్లపై రాళ్లు పడుతుండడంతో దయ్యాలు భూతాలు అనే ఆలోచనలు చేస్తున్నారు అక్కడ. అయితే దీనిపై పోలీసులు వెంటనే స్పందించి ఈ ఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే పట్టుకోవాలని లేకపోతే ఈ విషయం కాస్త ఎన్నో ఊళ్లకు పాకిపోయి సంచలనంగా మారుతుంది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: