ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆచరణలో ఉన్న నిర్ణయాన్ని యోగి తీసుకున్నారు. జగన్ చట్టం ఏపీలో ప్రయోగించిన విధంగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్మా చట్టాన్ని సీఎం అమలులోకి తెచ్చారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఎస్మా చట్టంతో ప్రైవేట్ ఆస్పతులలోని సౌకర్యాలను వినియోగించుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 
కరోనా చికిత్సకు ప్రభుత్వ వైద్యులు సరిపోరు కాబట్టి ప్రైవేట్ వైద్యులను కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. జగన్ ఎస్మా చట్టాన్ని అమలు చేయడంపై కొందరు వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యోగి అదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే దిశగా ముందడుగులు వేస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ సర్కార్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. 
 
ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వలస కూలీలు ప్రధాన కారణం కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకు వస్తున్న వలస కూలీలు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. వలస కూలీల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా నమోదు కావడంతో ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.                
 
కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వైద్యులకు చికిత్స అందించడంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆరు నెలల పాటు ఎస్మా చట్టం అమలులో ఉంటుందని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా వైద్య పరికరాలు, బెడ్ల కోసం ఎస్మా చట్టాన్ని ప్రయోగించగా యోగి సర్కార్ మాత్రం వైద్యుల కోసం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: